ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంక్ ఫుడ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని బంగాళదుంపలతో తయారుచేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. బంగాళదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి వాటిపై చిన్న చిన్న మసాలాపొడులు వేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వీటి ధర కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే. వీటిని చూస్తే చాలా లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డీప్ ఫ్రైడ్ పొటాటోస్ తినడం ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు. బంగాళదుంపలను 120 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు ఏర్పడే రసాయనం మైక్రిలామైడ్. ఈ రసాయనాన్ని ఆరోగ్య శాస్త్రవేత్తలు చాలా కాలంగా క్యాన్సర్ కారకంగా పరిగణిస్తున్నారట. ఇలా ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తింటే అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. అందుకే ఎంత వీలైతే అంతగా ఫ్రెంచ్ ఫ్రైస్ ని నివారించడం మంచిదట. ఎందుకంటే వాటిలోఎలాంటి పోషక విలువలు లేవు.
అలాగే ఇవి ఎప్పుడో వండినవి ఇందులో ప్రెజర్వేటివ్స్ కలపటం తర్వాత అనారోగ్యకరమైన సోడియంని కూడా కలిగి ఉంటాయని చెబుతున్నారు. వీటిని వేయించడానికి పదే పదే ఉపయోగించిన నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. వేయించిన బంగాళదుంపల కంటే ఉడకబెట్టిన బంగాళదుంపలను నిరబ్యంతరంగా తినవచ్చు అని చెబుతున్నారు. అది ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు. అలాగే మంచి నూనెతో తాజా బంగాళదుంపల్ని ఉపయోగించి మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగితే అలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ఉత్తమం అది కూడా చాలా తక్కువ సార్లు తినటం ఉత్తమం అని చెబుతున్నారు. చాలామంది ఫ్రిజ్లో ఎక్కువ రోజులు పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ని స్టోరేజ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు వేయించుకొని తింటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఫ్రెంచ్ఫేస్ ని తయారు చేసుకొని వేయించుకుని తినడం మంచిదని చెబుతున్నారు.