Site icon HashtagU Telugu

Eating With Hand: ఏంటి.. చేతితో భోజనం చేయడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

Eating With Hands Benefits

Eating With Hands Benefits

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి నడవడిక ప్రతి ఒక్కటి కూడా మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఆహారం భోజనం చేసేటప్పుడు ఎంచక్కా అందరూ ఒకేసారి నేలపై కూర్చుని చక్కగా చేతితో భోజనం చేసేవారు. కానీ రాను రాను ఆ రోజులే కరువయ్యాయి. డైనింగ్ టేబుల్ పై కూర్చుని స్పూన్ లతో తినడం అలవాటు చేసుకున్నారు. కేవలం ఒక్క ఆహార మాత్రమే కాకుండా టిఫిన్ లంచ్ ఇవన్నీ కూడా చేతితో కాకుండా స్పూన్ లతో తినడానికి బాగా అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ తరం రాబోయే తరం ప్రేక్షకులకు కూడా ఇవి అలవాట్లు నేర్పిస్తుండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.

ఆ సంగతి పక్కన పెడితే స్పూన్లతో కాకుండా చేతితో ఆహారం తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. అందరికీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చేతులతో తినే సమయంలో ముందుగా ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుంటాం. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. చేతులతో ఆహారం తినేవారిలో ఆహారాన్ని చేయి తాకగానే జ్ఞాన‌ నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీని వల్ల జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

చేతులతో తినే సమయంలో ఆహారాన్ని నేరుగా చేతిలోకి తీసుకుని నోటిలో పెట్టుకుంటాం. అప్పుడు ముక్కుద్వారా ఆ వాసన ఆహారం రుచిని మరింత పెంచుతుంది. ఇది చెంచాతో తినేటప్పుడు అనుభవించదు. మన చేతులతో తినేటప్పుడు మనం తినే ఆహారాన్ని సహజంగా కొలుస్తాము. చెంచాతో తింటే అతిగా తినే అవకాశం ఉంది. చెంచాతో అతిగా, వేగంగా తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది టైప్ -2 డయాబెటిస్‌కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం మన చేతులతో తినేటపుడు ఆహారం ఆకృతి, ఉష్ణోగ్రతను పసిగట్టవచ్చు. ఇది ఆహారంతో మరింత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

అంతేకాదు మన చేతులు, కడుపు, పేగులు కొన్ని మంచి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. చేతులతో భోజనం చేయడం చాలా మందికి ఆచారం. ఇది కుటుంబం కలిసి తినడం సామాజిక కోణాన్ని మెరుగుపరుస్తుంది. చేతులతో భోజనం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మనసుకు ఆనందం కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు చేతులతో తినడం మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.