Site icon HashtagU Telugu

‎Sitting on Floor: నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. డైనింగ్ టేబుల్ కి బైబై చెప్పేస్తారు!

Sitting On Floor

Sitting On Floor

Sitting on Floor: ‎‎కాలం మారిపోవడంతో ఆహారపు అలవాట్లు జీవనశైలి కూడా పూర్తిగా మారిపోయాయి. మన పెద్దల కాలంలో ఇంట్లో అందరూ ఎంచక్కా నేలపై కూర్చుని సంతోషంగా భోజనం చేసేవారు. కానీ రాను రాను కాలం మారిపోవడంతో మనుషులు కలిసి భోజనం చేయడమే మర్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో తింటున్నారు. అది కూడా డైనింగ్ టేబుల్ పైనే. లేదా సోఫా మీద, బెడ్ పైన, చైర్స్ పైన ఇలా ఎత్తైన ప్రదేశాలలో కూర్చుని తింటూ ఉంటారు. నేలపై కూర్చుని తినే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది.

‎ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు. మరీ నేలపై కూర్చుని భోజనం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నేలపై కాలు ముడుచుకుని కూర్చుని తిన్నప్పుడు, మీ శరీరం సహజంగా వంగుతుందట. యోగాలోని ఈ భంగిమ జీర్ణవ్యవస్థను యాక్టివేట్ చేస్తుందని, దీనివల్ల జీర్ణక్రియ సులభమవుతుందని చెబుతున్నారు. కూర్చోని నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండినట్లు మెదడుకు తొందరగా తెలుస్తుందట. దీనివల్ల ఎక్కువ తినకుండా ఉంటారు.

‎బరువు తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందట. ఈ భంగిమలో కూర్చుంటే కండరాలు సాగి, రక్తం బాగా ప్రవహిస్తుందట. అంతేకాకుండా దీర్ఘకాలంలో మధుమేహం,రక్తపోటు వంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. మంచంపై కూర్చుని తినడం చాలా మందికి అలవాటు. కానీ ఇది చెడ్డ అలవాటు. మంచంపై సరిగ్గా కూర్చోలేరు. దీనివల్ల ఆహారాన్ని సరిగ్గా నమలడం, మింగడం కష్టమవుతుందట. ఇది ఆధ్యాత్మికపరంగా కూడా అంత మంచిది కాదు అని చెబుతున్నారు. ఇలా మంచంపై తింటే త్వరగా గ్యాస్, అజీర్ణం వస్తాయట. క్రమం తప్పకుండా మంచంపై తింటే జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందట. ఊబకాయం పెరుగుతుందని,నిద్రపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా మంచంపై వంగి తినడం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుందట. దీనివల్ల వెన్నునొప్పి, కీళ్ల సమస్యలు రావచ్చని, అంతేకాకుండా ఆహార కణాలు మంచంపై పడి బ్యాక్టీరియా పెరగడానికి, పరిశుభ్రత సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే మంచంపై కూర్చుని తినడం అన్నది దరిద్రానికి సంకేతం అని చెబుతున్నారు. ఇలా తినకూడదని ఎల్లప్పుడూ నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిది అని చెబుతున్నారు. కాబట్టి ఇక మీదట మీరు కూడా నేలపై కూర్చొని భోజనం చేసే అలవాటు నేర్చుకోండి.

Exit mobile version