Food Chewing: ఆహారాన్ని తొందరగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మామూలుగా చాలా మందికి భోజనం చేసేటప్పుడు తొందర తొందరగా స్పీడ్ గా తినడం అలవాటు. మరికొందరు నెమ్మదిగా నిదానంగా తింటూ ఉంటారు. అయి

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 08:45 PM IST

మామూలుగా చాలా మందికి భోజనం చేసేటప్పుడు తొందర తొందరగా స్పీడ్ గా తినడం అలవాటు. మరికొందరు నెమ్మదిగా నిదానంగా తింటూ ఉంటారు. అయితే అలా నెమ్మదిగా భోజనం చేసే అలవాటు ఉన్నవారు స్పీడ్ గా తినే వారిని చూసి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని ఏ విషయం ఏమిటంటే అలా స్పీడుగా తినడం అన్నది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఎవరైతే నెమ్మదిగా ఆహారాన్ని నమిలి మింగుతూ తింటారో వారి ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు వైద్యులు. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల నోట్లో ఎక్కువసేపు నమలరు. కేవలం ఒకటి రెండుసార్లు నమిలి మింగేస్తారు. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. మరి భోజనాన్ని వేగంగా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆహారాన్ని సరిగా నమలకుండా మింగినప్పుడు అది జీర్ణాశయంలో విచ్ఛిన్నం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ ఎసిడిటీ, ఉబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ అనేది మొదట మన నోటిలోనే మొదలవుతుంది. ఆహారాన్ని నమలడం ద్వారా ముందే విచ్ఛిన్నం చేయాలి. ఇది శరీరంలో జీర్ణశయంలోకి చేరాక మరింతగా విచ్ఛిన్నమై సులువుగా జీర్ణం అవుతుంది. అదే ఆహారాన్ని నమలకుండా త్వరగా మింగేయడం వల్ల ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినేస్తారు. ముఖ్యంగా బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది. మనం తిన్న ఆహారం మనకు సరిపోయిందో లేదో పొట్ట నిండిన అనుభూతి రావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.

కానీ కేవలం 5 నిమిషాల్లోనో, పదినిమిషాల్లోనూ ఆహారాన్ని ముగించడం వల్ల పొట్ట నిండిన అనుభూతిని మెదడు గుర్తించలేదు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఆహారం మన శరీరానికి సరిపోతుందో లేదో మెదడు అంచనా వేస్తుంది. పొట్ట నిండిన అనుభూతిని మనకు పంపించడానికి 20 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది మెదడు. కానీ అంతవరకు నమిలి తినే వారి సంఖ్య తగ్గిపోతుంది. అదనపు బరువు పెరగడం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పొట్టనుండి వచ్చే అదనపు ఆమ్లాలు, గుండెల్లో తీవ్రమైన మంటను కలిగిస్తాయి. వేగంగా తినడం వల్ల ఊబకాయమే కాదు మధుమేహం వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. దీనివల్ల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఆహారాన్ని ఎప్పుడు నోటి నిండా పెట్టుకోకూడదు. కొంచెం అన్నం పెట్టుకున్న తర్వాత అది బాగా నమిలి మింగిన తర్వాత మరొక ముద్దని పెట్టుకోవాలి. అందుకే టతొందరగా ఆహారాన్ని తినకూడదు. ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టుకున్నాక కనీసం పది సార్లు అయినా ఆ అన్నాన్ని నమాలాలి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది.