Banana: ఏంటి!అరటి ఆకుల్లో భోజనం చేస్తే తెల్ల జుట్టు సమస్య ఉండదా?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 04:24 PM IST

ఇది వరకటి రోజుల్లో ఇళ్లలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అరటి ఆకుల్లో ఎక్కువగా భోజనం చేసేవారు. అలాగే ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా అరటి ఆకులో వడ్డించేవారు. ఇప్పటికీ చాలా ప్రదేశాలలో పెళ్లిళ్లలో అలాగే ఏదైనా ఫంక్షన్లలో అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. అది కూడా కొందరు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, అరటి ఆకుల్లో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ విధమైన సంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది. అంతేకాదుఅరటి ఆకులో ఆహారం తీసుకోవడం పవిత్రంగా, ఆరోగ్యకరంగా భావిస్తారు. దీనికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాస్త్రీయ నేపథ్యం కూడా ఉంది.

అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి, వాసన పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆకు వంటకు సూక్ష్మమైన రుచిని ఇస్తుంది. ఇలా అరటితో మరెన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా అరటి ఆకులలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తాయి. అరటి ఆకులలో సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అరటి ఆకులో తినే ఆహారం అనేక అనారోగ్యాలను దరి చేరకుండా చేస్తుంది. అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి. దాని పోషక విలువను మెరుగుపరుస్తాయి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కలిసిపోతాయి.

అంతేకాదు చాలా సార్లు ఆహారం మిగిలిపోయి భద్రంగా ఉంచాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాలలో మీరు అరటి ఆకుల సహాయం తీసుకోవచ్చు. అరటి ఆకులో ఆహారాన్ని చుట్టి నిల్వచేయటం వల్ల త్వరగా పాడవదు. అంతేకాదు అరటి ఆకులో తినడం జుట్టుకు కూడా మేలు చేస్తుందట. అరటి ఆకును నిత్యం తింటే జుట్టు నల్లగా మెరుస్తుందట. అరటి ఆకు కాలిన గాయాల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. అరటి ఆకుపై అల్లం నూనెను చిలకరించి, శరీరం కాలిన భాగంలో పై నుండి క్రిందికి చుట్టాలి. ఇది వేడి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే అరటి ఆకుల్లో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, ఇజిసిజి వంటి పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. అలాగే రాత్రిపూట అంధత్వం వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా చర్మంపై అల్సర్లు, మొటిమలు, మచ్చలు కనిపించవచ్చు. అలాంటప్పుడు అరటి ఆకుపై కొబ్బరి నూనె రాయండి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.