Site icon HashtagU Telugu

Eating Too Much Sweets: స్వీట్ ఇష్టమని ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?

Sweet Craving After Meal

Sweet Craving After Meal

మామూలుగా చాలామంది స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. వాళ్లకు స్వీట్ అంటే ఎంత పిచ్చి అంటే ఎదురుగా స్వీట్ కనిపిస్తే చాలు వెంటనే తినేస్తూ ఉంటారు. స్వీట్ అంటే ఇష్టము అనకంటే పిచ్చి ప్రాణం అని చెప్పవచ్చు. ఎంత తీయగా ఉన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం స్వీట్ ని అంతగా తినడానికి ఇష్టపడరు. ఎక్కువగా హాట్ ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే స్వీట్ తినడం మంచిదే కానీ అలా అని మితిమీరి తింటేమాత్రం అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు మన శరీరంలో డోపమైన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. దీని వల్ల స్వీట్స్‌ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ స్వీట్‌ ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత హాని జరుగుతుంది.

చక్కెరతో చేసిన స్వీట్స్‌ అమితంగా ఇష్టపడేవారు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటె స్వీట్స్‌ ఎక్కువ తీంటే శరీరంలోకి అధిక మొత్తంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు. అధిక బరువు కారణంగా హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్స్‌ తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. మనం తీసుకునే అన్నంలోనూ చక్కెర ఉంటుంది. స్వీటు తింటే రక్తంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చక్కెర విడుదలవుతుంది. దీనివల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది మనసు బాగోలేనప్పుడు తీయగా ఉండే కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు తింటుంటారు. కానీ అవి దీర్ఘకాలంలో డిప్రెషన్‌లోకి నెట్టేస్తాయి.

కొంతమంది పరగడుపున స్వీట్‌ తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల.. నీరసంగా ఉంటుందాని, ఏ పని మీద ఆసక్తి ఉండదట. చాలా మంది పేస్ట్రీలు, ఐస్ క్రీమ్ రాత్రి పూట తింటుంటారు. దీని వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఒత్తిడి హార్మోన్ పై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా సరిగా నిద్రపట్టదు. రాత్రి పూట స్వీట్స్‌ తినడం అలవాటుగా మారితే.. నిద్రలేమికి దారి తీస్తుంది. స్వీట్స్‌ ఎక్కువగా తింటే.. నోటి ఆరోగ్యానికి మంచిది కాదు. మిఠాయిలు ఎక్కువగా తినేవారికి దంతక్షయం కలుగుతుంది. స్వీట్‌ ఎక్కువగా తింటే కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చక్కెర ఎక్కువగా తినే వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. చర్మానికి బిగుతుగా ఉంటే కొల్లాజెన్ నాణ్యతను చక్కెర తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం మీద ముడతలు, గీతలు, మచ్చలు త్వరగా వస్తాయి. తీపి ఎక్కువగా తినేవారికి మొటిమలు ఎక్కువగా వస్తాయి.

Exit mobile version