Site icon HashtagU Telugu

Eggs in the Evening: నిద్రపోయే ముందు గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Foods Avoid With Eggs

Foods Avoid With Eggs

కోడి గుడ్డు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కోడిగుడ్ల శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కోడి గుడ్లలో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పొటాషియం, విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్-డి , విటమిన్ బి 6, విటమిన్ బి 12, మెగ్నిషియం గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే వైద్యులు తరచూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని గుడ్డు తినమని చెబుతూ ఉంటారు. గుడ్డును తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రాత్రుళ్ళు తినడం వల్ల మరిన్నీ లాభాలు ఉన్నాయి..

చాలామందికి గుడ్డు రాత్రి తినవచ్చా లేదా అన్న సందేహం నెలకొంటూ ఉంటుంది.. మరి రాత్రిపూట గుడ్డు తినవచ్చో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల ముఖ్యమైన లాభాల్లో నిద్ర ఒకటి. ట్రిఫ్టోఫాన్ పుష్కలంగా ఉన్న గుడ్లని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ ట్రిఫ్టోఫాన్ తీసుకోవడం వల్ల మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతుంది. హార్మోన్ల సమస్యల్ని దూరం చేస్తుంది. వీటిలోని మెలటోనిన్ నరాల కణాల పనితీరుని మెరుగ్గా చేయడంలో హెల్ప్ చేస్తాయి. దాంతో హాయిగా నిద్రపడుతుంది. అయితే గుడ్డును పడుకోవడానికి ముందు రెండు, మూడు గంటల ముందు తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. సహజంగా నిద్రపోవాలనుకునవారు ఈ గుడ్లని తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు.

గుడ్లలోని మెలటోనిన్ అందుకు బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చేవారు గుడ్డులోని తెల్ల సొన తీసుకోవడం మంచిది. గుడ్డు సొనలో సహజంగా విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి లోపం సమస్యతో బాధపడేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ డి అనేది నిద్ర సమస్యల్ని కూడా దూరం చేసి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. చాలా మంది బరువు తగ్గాలని చూస్తుంటారు. అలాంటి వారు గుడ్లు తినడం వల్ల అందులోని ప్రోటీన్ చాలా వరకూ ఆకలి కాకుండా చేస్తుంది. రాత్రుళ్ళు ఎక్కువ తినకుండా చేస్తుంది. అదే విధంగా, ముందుగా చెప్పుకున్నట్లు గుడ్లు తింటే మంచినిద్ర పడుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. గుడ్లలో లిపో ప్రోటీన్ స్థాయిలను పెంచడంలో సాయపడతాయి. దీని వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ప్రోటీన్ అనేది మీ కండరాలకు చాలా మంచిది. ఎగ్స్‌లోని ప్రోటీన్ హార్మోన్ల పనితీరుని బ్యాలెన్స్ చేస్తుంది. కండరాలను పెంచుకోవాలనుకునేవారు రోజూ గుడ్డు తినాలి.

Exit mobile version