Site icon HashtagU Telugu

Dates: దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Capture 1700755331

Capture 1700755331

మామూలుగా చాలామందికి సీజన్లు చేంజ్ అయినప్పుడు అలాగే చలికాలంలో వర్షాకాలంలో దగ్గు జలుబు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి వేసవిలో కూడా ఈ దగ్గు జలుబు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి ఈ సమస్య రాత్రిపూట మరింత వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉపయోగించడంతోపాటు హోం రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డ్రైఫ్రూట్స్ తినడం చాలా మంచిది. వీటిని తినడంవల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఖర్జూరం సహాయపడుతుంది. శీతాకాలంలో వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, మినరల్స్, ఐరన్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి. ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రావు. శీతాకాలంలో జలుబు, దగ్గు చేయడం సహజం. అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.

తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి. వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి. ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు. ఖర్జూరంలో కాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. బరువు పెరగకపోతుంటే ప్రతిరోజు శీతాకాలంలోప్రతిరోజు ఖర్జూరం తినాలి. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతారు. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి.