చాలామంది భోజనం తినేటప్పుడు కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. కొందరు ఆ కాంబినేషన్స్ లో తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ లో పెరుగు మామిడి పండ్లు ఒకటి అయితే పెరుగు అరటి పండు కూడా ఒకటి. చాలామంది పెరుగన్నంలో అరటి పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు అంతగా ఇష్టపడరు.. మరి పెరుగన్నంలో అరటి పండ్లు కలిపి తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సమ్మర్ లో పెరుగన్నంలో అరటిపండు వేసుకుని తింటే శరీరంలో వేడి తగ్గుతుందట. అలాగే వేడి వల్ల కలిగే ఒత్తిడి తగ్గి ఇబ్బందులను, చికాకును దూరం చేస్తుందట.
వేసవిలో వచ్చే అతి పెద్ద ప్రధాన సమస్యలలో డీహైడ్రేషన్ సమస్య కూడా ఒకటి. అయితే ఈ సమయంలో మీరు పెరుగున్నం తింటే డీహైడ్రేషన్ తగ్గి శరీరానికి హైడ్రేషన్ అందుతుందట. అలాగే పెరుగులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి హెల్తీ గట్ ని ప్రమోట్ చేస్తాయట. అలాగే వేసవికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుందని, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. పైగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందట. సమ్మర్లో వివిధ కారణాల వల్ల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఇది సహజంగా పోషకాలను అందించి రక్తపోటును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందట. పొటాషియం బీపీని కంట్రోల్ చేసే అతి ముఖ్యమైన ఖనిజం. సమ్మర్లో వచ్చే బీపీ సమస్యలను తగ్గించుకోవడానికి తీసుకోవచ్చని చెబుతున్నారు. అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఇది పేగు కదలికలను మెరుగుచేసి మలబద్ధకాన్ని నివారించడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా దీనితో బాధ పడేవారు నిపుణుల సలహా మేరకు తరచుగా మితంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. పండని అరటిపండ్లు జీర్ణం అవడం కష్టంగా ఉంటుంది. ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయట.
కాబట్టి పెరుగులో అరటిపండు వేసుకోవాలంటే పండినవి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. స్వీట్ పెరుగు లేదా ఇతర ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తీసుకోకపోవడమే మంచిదట. ఎందుకంటే వాటిలో షుగర్స్ ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు. లాక్టోస్ వల్ల మీకు ఇబ్బందులు ఉంటే పాల ఉత్పత్తులు మీకు అలెర్జీలు కలిగిస్తాయట. కాబట్టి దానిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అదే విధంగా బరువు తగ్గాలనుకునేవారు పెరుగన్నంలో అరటిపండు కలిపి తినాలనుకుంటే పోర్షన్ కంట్రోల్ ఫాలో అవ్వాలట. ఎందుకంటే ఇది టేస్టీ కాంబినేషన్ అయినప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కేలరీలు ఎక్కువ అవుతాయట. తరచుగా ఇలా తీసుకుంటే బరువు పెరుగుతారట. పోషకాల అసమతుల్యత కూడా ఏర్పడే అవకాశం ఉంది అని కాబట్టి ఇలా తినాలనుకుంటే కంట్రోల్ చేసి తీసుకోవచ్చని చెబుతున్నారు.