పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. పెరుగు తినడం మంచిదే కానీ పెరుగు తినే సమయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. రాత్రి సమయంలో అలాగే భోజనం చేసేటప్పుడు పెరుగు లేనిది ముద్ద కూడా దిగదు. ముఖ్యంగా రాత్రి సమయంలో కచ్చితంగా చాలామందికి పెరుగు ఉండాల్సిందే. పెరుగు వల్ల చాలా లాభాలు,ప్రయోజనాలు ఉన్నాయి కానీ అలా అని ప్రతిరోజు తిరుగును తినడం మంచిది కాదంటున్నారు వైద్యులు. మరి ప్రతిరోజు పెరుగును తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని చాలా మంది పెరుగు తినాలని చెబుతుంటారు. పెరుగు ప్రోబయోటిక్స్, న్యూట్రిషన్‌తో కూడిన ఆహారం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఇతర ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కొంతమందికి పెరుగు తింటే మొటిమలు, స్కిన్ అలర్జీ, జీర్ణ సమస్యలు పెరుగు తిన్న తర్వాత ఎక్కువగా వేడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తింటే సాధారణంగా శరీరం చల్లబడుతుంది. కానీ, ఇది వేడెక్కడం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఎండాకాలంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బాడీలో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణంగా వ్యక్తికి వాత, పిత్త, కఫా దోషాలు ఉంటాయి.
అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పెరుగు రుచిలో పుల్లని, వేడిగా ఉంటుంది. జీర్ణం చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాలలో ఎక్కువగా ఉంటుంది. వాత దోషంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏ సీజన్‌లో అయినా, పెరుగు తినేటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాలి. సమ్మర్ లో పెరుగుని హెల్దీ అని తీసుకుంటారు. దీని వల్ల మొటిమలు, ఇతర సమస్యలు ముఖంపై కనిపిస్తాయి. పెరుగు సరిగ్గా తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు. చాలా మంది వంటలు చేసేటప్పుడు పెరుగుని వేడి చేస్తుంటారు. కానీ, అలా అస్సలు చేయొద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, దీని వల్ల అందులోని గొప్ప గుణాలు తగ్గిపోతాయి. కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు ఉన్నవారు తగ్గించి తినాలి. పండ్లతో కలిపి కూడా పెరుగు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, పెరుగుని తినేటప్పుడు వీటన్నింటిని గుర్తుంచుకోవాలి.