Site icon HashtagU Telugu

Cabbage Benefits: క్యాబేజీ తినడానికి ఇష్టపడడం లేదా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 03 Jul 2024 05 30 Pm 8147

Mixcollage 03 Jul 2024 05 30 Pm 8147

క్యాబేజీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ క్యాబేజీని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా క్యాబేజీని ఉపయోగించి చాలా తక్కువ రకాలు వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్యాబేజీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల కలిగే లాభాలు గురించి తెలిస్తే మాత్రం క్యాబేజీని తినకుండా అస్సలు ఉండలేరు. మరి క్యాబేజీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

అలాగే ఇందులో పీచు పదార్థాలతో పాటుగా రైబో ప్లేవిన్,పోలిట్ విటమిన్ సి,థయామిన్, విటమిన్ b6, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా క్యాబేజీని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. క్యాబేజీ లో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల ఉండే మచ్చలను తొలగించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కంటి శుక్లాలు రాకుండా రక్షణ ఎలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఇందులో ఉండే విటమిన్ కె రెడ్ అల్జీమర్స్ సమస్యను నివారిస్తుందట. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట, కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ క్యాబేజీ డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే క్యాబేజీ ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందట. క్యాబేజీని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగే అవకాశమే ఉండదని, క్యాజేజీ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని, ఈ కూరగాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుందని, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు వైద్యులు.

అదేవిధంగా క్యాబేజీ గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడుతుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడానికి ఎంతో బాగా సహాయపడతాయట. కాబట్టి క్యాబేజీని తరచుగా తినడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్స్ లు జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయని వైద్యులు తెలిపారు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యున్ని సంప్రదించడం మంచిది.

Exit mobile version