మన వంటింట్లో దొరికే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. అయితే చాలామంది సొరకాయను తినడానికి ఇష్టపడరు. ఇంకొందరు సొరకాయను ఇష్టపడి మరి తింటూ ఉంటారు. ఈ సొరకాయను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. తెలంగాణ సైడ్ అయితే ఆనిగపుకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించి ఎన్నో రకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. సొరకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి సొరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సొరకాయ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సొరకాయ గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది.సొరకాయ రసాన్ని వారానికి మూడుసార్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇనుము, విటమిన్లు, పొటాషియంతో నిండిన సొరకాయ రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా శరీరంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థంగా పని చేస్తుంది. ఇందులో ఉన్న మత్తు గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు త్వరగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సొరకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చట. జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు నల్లబడే అవకాశం ఉందట. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. హైబీపీ సమస్య ఉన్న వారు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.