Biryani : ఈ కాలంలో మనుషుల జీవన శైలి మారింది. దానికనుగుణంగానే రోగాలు కూడా పెరుగుతున్నాయి. మన పెద్దలు బయటి ఫుడ్(Food) కంటే కూడా ఏం కావాలన్నా ఇంట్లోనే వండుకుని తినేవారు. అందుకే ఆ కాలం నాటివారు ఈరోజుకి కాస్త ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్(Breakfast) నుంచి మొదలు లంచ్(Lunch), స్నాక్స్, డిన్నర్(Dinner) ఏది కావాలన్నా ఇంట్లో చేసిన దానికంటే బయట తయారు చేసిన వాటికే మొగ్గు చూపుతున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్ లకు అలవాటు పడిపోతూ చిన్న వయసులోనే ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.
బయట వండే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. హైజెనిక్ గా ఉండవు. నిల్వ ఉంచిన పదార్థాలనే అమ్మేస్తుంటారు. ఫలితంగా ఆహారం పేరుతో రోగాలనే డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్ద అంతా ఇష్టంగా తినే వాటిలో ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బిర్యానీలే అధికం. అందునా 90 శాతం మంది నాన్ వెజ్ ప్రియులే. బిర్యానీ అధికంగా తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా హోటల్స్ లో లభించే బిర్యానీల్లో కార్బో హైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు, మసాలాలు, చికెన్, మటన్ క్వాలిటీగా ఉండవు. ఎంత పెద్ద హోటలైనా సరే ఎంతోకొంత నిల్వ పదార్థాలు, నాసిరకపు పదార్థాలను వాడుతుంటారు. అలాంటి వాటితో తయారు చేసిన బిర్యానీలు తినడం వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక ఏం కావాలన్నా ఇంటికే వస్తుండటంతో బిర్యానీలు తినేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
బిర్యానీలో అధికంగా తినడం వల్ల ఊబకాయం, గ్యాస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగని బిర్యానీ తినకూడదా అంటే వీలైనంత వరకూ ఇంట్లో తయారు చేసుకున్న వంటకం లేదా ఎప్పుడైనా ఒకసారి హోటల్ బిర్యానీ తినొచ్చు. అంతేగానీ వారానికి 3,4 సార్లు బిర్యానీలు తింటే ప్రాణాలకు ముప్పు. ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, బిర్యానీకి కొంచెం దూరం ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read : Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కు.. నిద్రలేమికి చెక్ పెట్టే 7 టిప్స్