Betel Leaf: భోజనం చేసిన తర్వాత తమలపాకు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత ఆ తమలపాకులు తినే అలవాటు ఉంటుంది. చాలా పెళ్లిళ్లలో అలాగే శుభకార్యాలలో భోజనం చేసిన తర్వాత కీల్లీ అని ఇ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 03 Jul 2024 05 33 Pm 4400

Mixcollage 03 Jul 2024 05 33 Pm 4400

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత ఆ తమలపాకులు తినే అలవాటు ఉంటుంది. చాలా పెళ్లిళ్లలో అలాగే శుభకార్యాలలో భోజనం చేసిన తర్వాత కీల్లీ అని ఇస్తూ ఉంటారు. అయితే మామూలుగా తమలపాకు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ తమలపాకును భోజనం చేసిన తర్వాత తినవచ్చా? తింటే ఏం పెరుగుతుందో ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చెబుతున్నారు.

ఈ తమలపాకులలో ఉండే విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ వంటి విటమిన్ లతో పాటుగా క్యాల్షియం లాంటి అనేక పోషకాలు కూడా లభిస్తాయట. ఈ తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగు పరచడానికి, కడుపు, ప్రేగులలో pH స్థాయులను క్రమ బద్ధీకరించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా తమలపాకు ఒక అద్భుతమైన నొప్పి నివారిణిగా పని చేస్తుందట. నొప్పుల నుంచి తొందరగా ఉపశమనం కలిగించేలా చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున తమలపాకు తినడం వల్ల కూడా అనేక రకాల లాభాలు ఉన్నాయట. ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అంటున్నారు వైద్యులు.

కడుపు సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో తమలపాకును తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే తవలపాకులు తీసుకోవడం వల్ల ఛాతి, ఊపిరితిత్తులు, ఆస్తమా లాంటి సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. తమలాపాకులపై కొద్దిగా ఆవాల నూనెను రాసి, వేడి చేసి ఛాతీపై ఉంచితే గుండె నొప్పి సమస్యల బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్ లు సోకవట. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమలపాకు తింటే కాస్త ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.

  Last Updated: 03 Jul 2024, 05:34 PM IST