Site icon HashtagU Telugu

Health Tips: నెయ్యి, బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Health Tips

Health Tips

నెయ్యి బెల్లం ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇవి రెండూ చాలా రకాల సమస్యలకు మెడిసిన్ లా పనిచేస్తాయి. వీటిని విడి విడివిడిగా తినడం కంటే కలిపి తింటే మరిన్ని లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. కొన్నిసార్లు మనం ఎక్కువగా తిన్నప్పుడు ఎసిడిటీ గ్యాస్, కడుపులో మంట అలాంటి సమస్యలు అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గోరువెచ్చని ఎక్కువగా తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే లభిస్తుంది. కానీ నెయ్యి బెలం కలిపి తీసుకుంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.

నెయ్యి, బెల్లం కలయిక లివర్ పనితీరుకి కూడా చాలా మంచిది. నెయ్యి లివర్ పనితీరుని పెంచగా బెల్లంలో డీటాక్సీ ఫై గుణాలు ఉన్నాయి. కూడా లివర్‌కి ఎంతో మేలు చేస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. లివర్‌ కి ఎలాంటి సమస్యలొచ్చినా దూరమవుతాయని చెబుతున్నారు. నెయ్యిలో విటమిన్ కె2 ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పిల్లలు, పెద్దవారికి కూడా ఈ రెమిడీ చాలా మంచిది.

అలాగే నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్, ఫ్యాట్ సోల్యూబుల్ విటమిన్స్ అంటే ఏ, ఈ, డీలు ఉంటాయి. బెల్లంలో మినరల్స్ అయిన ఐరన్, మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయట. వీటిని రెండు కలిపి తీసుకున్నప్పుడు బాడీకి అదనపు పోషకాలు అందుతాయని, ఇవి భోజనం చేశాక తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. బెల్లం, నెయ్యి కలయిక రెండూ కూడా బాడీలోని వాత, పిత్తా, కఫా దోషాలను దూరం చేస్తాయి. ఈ రెండింటి కలయిక పోషకాలని అందిస్తాయి. ఇవి శరీరంలోని సమస్యల్ని దూరం చేయడంలో బాగా పనిచేస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.