అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండును తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. తరచుగా అరటి పండు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు అరటిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. అరటి పండు తింటే నిద్ర ముంచుకు వస్తుంది అని కొంతమంది అంటున్నారు.
మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండులో ఉండే ట్రిప్టోఫాన్ శరీరంలో సెరోటోనిన్nను మెలటోనిన్ గా మార్చి, మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుందట. అలాగే, పొటాషియం, మెగ్నీషియం కండరాలను సడలించి ఒత్తిడిని తగ్గిస్తాయట. ఈ కారణాల వల్ల రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల నిజంగానే బాగా నిద్ర వస్తుందట. అరటిపండ్లు తినడం వల్ల బాగా నిద్ర పట్టవచ్చు. కానీ ఇది అందరికీ వర్తించదట. అందరికీ ఒకే విధంగా ఇది పనిచేయదట. వారి ఆహారం నిద్ర వాతావరణం, వ్యక్తిగత జీవనశైలి వారి నిద్ర నాణ్యతను బాగా ప్రభావితం చేస్తాయట.
కొంతమందికి అరటిపండ్లను తక్కువ మొత్తంలో తినడం వల్ల కొంత ప్రయోజనం లభిస్తుందట. నిద్ర మాత్రలు వేసుకునే వారికి కూడా ఇది చాలా మంచిదట. ప్రతిరోజూ మాత్రలు వేసుకుని నిద్రపోవడం మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా అరటిపండ్లు తినడం వల్ల నిద్ర సహజంగా వస్తుందని చెబుతున్నారు. అరటిపండ్లు ఆరోగ్యకరమైన ఆహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాత్రిపూట తినడం వల్ల ఎటువంటి హాని జరగదు. కానీ నిద్ర సమస్యలకు పరిష్కారంగా దాన్ని పూర్తిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఇది అందరికీ అనుకూలంగా ఉండదు. సమతుల్య ఆహారం, క్రమమైన షెడ్యూల్, ఒత్తిడి లేని మనస్సు అన్నీ మంచి రాత్రి నిద్రకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరు అరటి పళ్ళు తినే ముందు మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.