Health Tips: ప్రతిరోజు 2 యాలకులు ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు యాలకులు కూడా ఒకటి. ఈ యాలకులని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కేవలం రుచి పరంగానే మాత్ర

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Feb 2024 09 34 Pm 628

Mixcollage 20 Feb 2024 09 34 Pm 628

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు యాలకులు కూడా ఒకటి. ఈ యాలకులని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కేవలం రుచి పరంగానే మాత్రమే కాకుండా వాసన పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. యాలకులను తరచుగా వినియోగించడం లాంటివి చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు గుండెపోటు లాంటి అసాధారణ సమస్యలను నివారించడంలో యాలకులు కీలకపాత్ర వహిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలకులు తిని ఒక గ్లాసు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన వ్యర్ధాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. మలబద్ధక సమస్య నుండి కూడా విముక్తి పొందుతారు. నిద్రలేమి సమస్య నిద్రలో వచ్చే గురకను కూడా యాలకులు తగ్గిస్తాయి. ఇక యాలకులు శృంగార జీవితంలో ఏర్పడే అపసృత్యులను తొలగిస్తాయి. లైంగిక సమస్యలను దూరం చేస్తాయి. పడక గదిలో ఏర్పడే ఒత్తిడిలను తగ్గించి మంచి మూడ్ని యాలకులు తీసుకొస్తాయి.

అంతేకాకుండా వీర్యంలో శుక్ర కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. శృంగార జీవితానికి యాలకులు ఒక శక్తివంతమైన టానిక్ అని చెప్పవచ్చు. శ్రీకర స్కలనం నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలకు యాలకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. సంభోగంలో ఎక్కువ సేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేస్తాయి. అందువల్ల రోజు యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శృంగారపరమైన సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇక చర్మ సౌందర్యానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

  Last Updated: 20 Feb 2024, 09:34 PM IST