Health Talk: ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!!

వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:32 AM IST

వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న సీజన్‌లో దగ్గు, జలుబు వేధిస్తుంటాయి. అందుకే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొంచెం అశ్రద్ధ వహించినా అనారోగ్యానికి గురవుతారు. అందుకే ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ తినాలి. వీటిలో పోషక మూలకాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వీటిని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. కేవలం డైట్‌మాత్రమే కాకుండా మనం మరికొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. రోజూ వ్యాయామం, పరిశుభ్రత చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంపొందించే సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

అల్లం:
అల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిని సూపర్ ఫుడ్స్ విభాగంలో చేర్చారు. సాధారణంగా భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగిస్తారు. అంతేకాదు అల్లం టీ కూడా చాలామంది ఇష్టంగా తాగుతుంటారు. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అల్లం ఆహారానికి మరింత రుచిని సువాసనను ఇస్తుంది. దీని మూలాలలో జింజెరాల్ సమ్మేళనం ఉంటుంది, ఇది గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది. అల్లం ఏ రూపంలోనైనా తినవచ్చు. మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. మీరు అల్లం డికాక్షన్ చేయవచ్చు. అల్లం ఉడకబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వెల్లుల్లి:
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సూపర్‌ఫుడ్స్ వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచిది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను పెంచడం ద్వారా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రేగులలో బ్యాక్టీరియా అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది.

పుట్టగొడుగు:
పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులో ప్రోటీన్, బి-విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. మంచి రోగనిరోధక శక్తి కోసం, మీరు తప్పనిసరిగా పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి. ఇమ్యూనిటీని పెంచడంలో మష్రూమ్స్ పనిచేస్తాయి. పుట్టగొడుగులను సలాడ్లు లేదా ఇతరఆహార పదార్థాల్లో చేర్చవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:
-రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
-పౌష్టికాహారం తీసుకోండి. మీ ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఉండేలా చూసుకోండి.
-తగినంత నిద్ర అవసరం. కనీసం 8 గంటలు నిద్రపోండి.
-తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి.
-బరువుపై కూడా శ్రద్ధ వహించాలి.
-మద్యం సేవించడం మానుకోండి. ధూమపానానికి దూరంగా ఉండండి.