Site icon HashtagU Telugu

Eyesight: కళ్ళు బాగా కనిపించాలి అంటే ఈ పండ్లను తినాల్సిందే!

High Blood Pressure

High Blood Pressure

ఇటీవల కాలంలో డిజిటల్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో చాలామంది కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా చిన్న వయసులోనే కంటి చూపు సమస్యను కోల్పోవడంతో పాటు కళ్లద్దాలు బానిసలు అయిపోతున్నారు. పదేళ్ల పిల్లవాడి నుంచి ఈ కళ్లద్దాల సమస్య మొదలవుతుంది. అందుకు గల కారణం పిల్లలకు టీవీలో, లాప్టాప్ లు స్మార్ట్ ఫోన్ లను ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడమే. క్రమంగా ఒక వయసు వచ్చేసరికి ఈ పిల్లలు కంటి చూపు ను కోల్పోతున్నారు. దీంతోపాటు కొందరు పోషకాహార లోపం వల్ల కూడా కంటిచూపుతో బాధపడుతున్నారు. అయితే ఈ కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి, గంటల తరబడి ఫోన్, ల్యాప్ టాప్ ను చూడటం వల్ల నేడు చాలా మంది కళ్ల జోళ్లను వాడుతున్నారు. ఒక వయస్సు తర్వాత కళ్లు బలహీనపడతాయి. ఈ కారణంగానే కళ్లజోడును ధరించాల్సి వస్తుంది. కానీ పోషకాల లోపం వల్ల నేడు చిన్న పిల్లలు కూడా కళ్లజోళ్లను వాడుతున్నారు. మరి ఆ అవసరం రాకుండా ఉండాలి అంటే తినాల్సిన వాటిలో కివి పండు కూడా ఒకటి. ఈ పండును తింటే మీ కంటి చూపు పెరుగుతుందట. వయసు పై బడిన తర్వాత కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ పండును తినడం వల్ల కంటిచూపు తగ్గే అవకాశం ఉండదు. కివిలు మన కళ్లకు మంచివి. ఈ పండులో జియాక్సంతిన్, లుటిన్ అనే వర్ణద్రవ్యాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయట. కంటిచూపు తగ్గకుండా కాపాడుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయి పండు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు కంటి సమస్యలను రాకుండా చేస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మన కంటిచూపును పెంచుతాయని చెబుతున్నారు. అవొకాడో కూడా మన కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి 6, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే ఈ పండు మన కంటిచూపును పెంచడానికి సహాయపడతాయట. ఉసిరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి కంటికి కూడా ఎంతో మేలు చేస్తుందట. ఉసిసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి కంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లలోని రెటీనా కణాలను బలంగా చేస్తుందని చెబుతున్నారు.