Dengue : ఈ ఫుడ్స్ తో…డెంగ్యూకి చెక్ పెట్టవచ్చు…!!

వర్షాకాలం మొదలైదంటే...ఎన్నో రోగాలు మొదలైనట్లే. ఇక దోమల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దోమల బెడదా ఎక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 08:45 AM IST

వర్షాకాలం మొదలైదంటే…ఎన్నో రోగాలు మొదలైనట్లే. ఇక దోమల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దోమల బెడదా ఎక్కువగా ఉంటుంది. కంటికి కనిపించనంత చిన్న దోమ మన ఒంటికి చేసే కీడు మాటల్లో చెప్పలేం. రక్తాన్ని పీల్చి అది బతుకుతుంది. మన ప్రాణాలను మాత్రం ప్రమాదంలో నెట్టేస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. ఈ జ్వరం ఒక్కోసారి ప్రాణాలు తీసేవరకు వెళ్తుంది.

అయితే డెంగీకి చెక్ పెట్టాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ వస్తే శరీరంలో ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయి. రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఈ క్రమంలోనే అధికనొప్పులు వస్తాయి. ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల ఆహార జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.

1. డెంగీతో బాధపడేవారికి దానిమ్మ, కివీ, బొప్పాయి, యాపిల్ పండ్లు ఎక్కువగా తినిపించాలి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.

2. బొప్పాయి ఆకులను తీసుకుని..వాటి నుంచి జ్యూస్ తీయాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు చెంచాల జ్యూస్ డెంగీరోగికి ఇచ్చినట్లయితే రోగి త్వరగా కోలుకుంటాడు.

3. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నవారు ఎక్కువగా కొబ్బరినీళ్లు తాగడం మంచిది. ఇందులో ఎలెక్ట్రోలైట్స్, ఇతర ట్రేస్ మినరల్స్ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.

4. నేచురల్ హెర్బల్ టీ తాగడం చాలా మంచిది. ఈ హేర్బల్ టీ అల్లం, యాలకులతో తయారు చేస్తారు. ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.

5. వేపాలకుతో తయారు చేసిన రసాన్ని డెంగ్యూ రోగికి తాగించడం చాలా మంచిది. శరీరంలో తెల్లరక్త కణాలు పెంచడంతోపాటుగా రోగనిరోధక శక్తినికూడా పెంచుతుంది. వ్యాధినివారణకు చక్కగా సహాయపడతుంది.

6. ఆరెంజ్ జ్యూస్ కూడా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యూరినరీ అవుట్ ఫుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించడం ద్వారా రోగి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. డెంగ్యూ రోగులకు సిట్రస్ ఫ్రూట్స్ చక్కటి ఆహారం.

7. డెంగ్యూ బారినపడిన వ్యక్తి శరీరానికి కావాల్సిన నీరును తప్పనిసరిగా అందించాలి.అప్పుడే శరీరంలోని వ్యర్ధపదార్థాలు బయటకు వెళ్తాయి. తద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది.

8. కొత్తిమీర ఆకులతో జ్యూస్ తయారు చేసి రోగికి తాగించాలి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. శరీరంలోని బ్యాక్టీరియాతో పోరాడే శక్తి దీనికి ఉంది.

9. పండ్లు, ఆకుపచ్చని కూరగాయాలు ఎక్కువగా ఇవ్వాలి. ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.