Site icon HashtagU Telugu

Dry Fruits: ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తింటే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Dry Fruits

Dry Fruits

బరువు తగ్గడం అన్నది అంత ఈజీ విషయం కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బరువు పెరగడం ఎంత ఈజీనో, బరువు తగ్గడం అన్నది అంత కష్టమైన పని. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొందరు అయితే తినడం మానేస్తూ ఉంటారు.కొందరు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వాటితో పాటు కొన్ని రకాల పనులు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయట.

అందులో ఖర్జూరం కూడా ఒకటి. కాగా ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి. అలాగే ఈ ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంటే వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుందట. దాంతో మీరు తినాలనే కోరికను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే దీనిలో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. అంటే ఇవి ఒక రోజుకు అవసరమైన ఎనర్జీని మీకు అందిస్తాయి. అసలిపోకుండా పనిచేయడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.
అలాగే అంజీర పండ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ అంజిరా పండ్లు కూడా బరువు తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగ పడతాయట.

అంజీర పండ్లు కూడా డ్రై గా దొరుకుతాయి. ఈ పండ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేసి బరువు తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గడానికి నానబెట్టిన అంజీర పండ్లను తినాలనీ చెబుతున్నారు. జీడిపప్పు తినడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. జీడిపప్పును ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉండటమే కాదు. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. ఈ డ్రై ఫ్రూట్స్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుందట.

అయితే జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే జీడిపప్పులను ఎక్కువగా తినకపోవడమే మంచిది. మోతాదులో తింటేనే మీరు బరువు తగ్గుతారు. లేదంటే బరువు పెరిగిపోతారు. పిస్తాలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పిస్తాలను తింటే మీరు ఇబ్బంది లేకుండా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాదంపప్పు ఎండు ద్రాక్ష వంటివి కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.