Site icon HashtagU Telugu

Cream Biscuits : క్రీమ్ బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా.. ఒకేసారి ఎక్కువగా తింటే..

eat so many Cream Biscuits at once causes health problems

eat so many Cream Biscuits at once causes health problems

చాలామంది బిస్కెట్స్(Biscuits) టైంపాస్ కి తింటూ ఉంటారు. మనకు ఎప్పుడు ఆకలి వేసినా, ట్రావెలింగ్ లో తినడానికి బిస్కెట్స్, మంచినీళ్లు(Water) మన దగ్గర ఉంచుకుంటాము. అయితే ఎక్కువగా క్రీమ్ బిస్కెట్స్, మ్యారీ బిస్కెట్స్, బేకరీ బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్.. ఇలా రకరకాలు తింటూ ఉంటారు. అయితే మనకు ఆకలి వేయగానే ఒకేసారి ఎనిమిది లేదా పది బిస్కెట్స్ తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకేసారి అన్ని తినడం వలన జీర్ణపరమైన సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి.

ముఖ్యంగా క్రీమ్ బిస్కెట్స్(Cream Biscuits) లో క్యాలరీలు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో క్రీమ్ బిస్కెట్స్ తినడం వలన శరీర బరువు పెరుగుతారు. బరువు పెరగడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్కువగా క్రీమ్ బిస్కెట్స్ తినడం వలన మన శరీరంలోని రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. క్రీమ్ బిస్కెట్స్ ని మైదా పిండితో తయారుచేస్తారు కాబట్టి వీటిని తినడం వలన కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా ఉండడం వలన మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

క్రీమ్ బిస్కెట్స్ లో క్రీమ్స్ కోసం వాడే బ్యూటీలేటెడ్ హైడ్రాక్సీయానిసోల్, బ్యూటీలేటెడ్ హైడ్రాక్సీటోల్యున్ అనే రెండు పదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం. క్రీమ్ బిస్కెట్స్ తినాలి అనుకుంటే కొన్ని కొన్ని తినవచ్చు అంతేకాని ఒకేసారి ఎక్కువ మొత్తంలో క్రీమ్ బిస్కెట్స్ తింటే బరువు పెరగడం, రక్తంలో చక్కర స్థాయిలు పెరగడం వంటివి జరుగుతాయి. దానివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 

Also Read : Honey With Milk Benefits: పాలలో తేనె కలిపి తాగితే ఎన్నో బెనిఫిట్స్.. ముఖ్యంగా అలాంటి వారికి..!