Health Tips: ముక్కులో నుంచి రక్తం కారుతోందా? అయితే వెంటనే ఇలా చేయండి?

మామూలుగా చాలామందికి అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు శరీరంలో వేడి ఎక్కువ అయింది అందుకే అలా వస్తుంది అని చా

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 08:00 PM IST

మామూలుగా చాలామందికి అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు శరీరంలో వేడి ఎక్కువ అయింది అందుకే అలా వస్తుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే చాలామంది ఇలా ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటారు. నిజానికి ముక్కులో నుంచి రక్తం కారడం అనేది చాలా చిన్న సమస్య. పది మందిలో ఐదారుగురికి ఈ సమస్య ఉంటుంది. అది కూడా తరచుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది.

ముక్కులో నుంచి రక్తం కారితే చాలా మంది భయపడుతుంటారు. కానీ ముక్కులో నుంచి రక్తం కారినంత మాత్రాన ఏం కాదు. కాకపోతే దాన్ని వెంటనే ఆపేస్తే బెటర్. లేదంటే ముక్కు లోనుంచి రక్తం కారుతూనే ఉంటుంది. ఎక్కువగా వేడి ఉన్నవాళ్లకు ఇదో పెద్ద సమస్యగా అనిపించదు. వేసవి కాలంలో లేదా ఎక్కువగా వేడి పదార్థాలను తిన్నప్పుడు ముక్కులో నుంచి చెడు రక్తం కారుతుంది. నిజానికి ఆ రక్తం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే శరీరం ఆ రక్తాన్ని ముక్కు నుంచి బయటికి పంపించేస్తుంది.

ఒకవేళ ముక్కులో నుంచి రక్తం వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ముక్కులో నుంచి రక్తం రాగానే తెగ టెన్షన్ పడిపోతుంటారు. అటువంటి వాళ్లు ఏం చేయాలంటే వెంటనే కొంచెం పటిక బెల్లాన్ని తీసుకొని.. దాన్ని నీటిలో కలిపి వెంటనే తాగేస్తే ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ముక్కు నుంచి రక్తం కారడాన్ని వెంటనే ఆపాలంటే ఇలా ట్రై చేస్తే బెటర్. పటిక బెల్లం వల్ల తక్షణ శక్తి వస్తుంది. తిన్న ఫుడ్డు అరగకపోయినా కొంచెం పటిక బెల్లం తిన్నా చాలు. అరుగుదలకు పటిక బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.