Ladies Finger:షుగర్ వ్యాధిని తరిమికొట్టే ఈ కూరగాయల గురించి మీకు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య డయాబెటిస్. దీనినే మధుమేహం, షుగర్ వ్యాధి, అని కూడా

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 09:15 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య డయాబెటిస్. దీనినే మధుమేహం, షుగర్ వ్యాధి, అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందిని ఈ డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. ఇంతకుముందు రోజుల్లో డయాబెటిస్ ఎక్కువగా వయసు మీద పడిన వారికి మాత్రమే డయాబెటిస్ వ్యాధి వస్తూ ఉండేవి. కానీ రాను రాను మానవ జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న ఏజ్ వరకే ఈ డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఇకపోతే డయాబెటిస్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు జీవితాంతం అలాగే ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు ఇటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి వ్యాధులు కానీ లేదంటే ఏదైనా దెబ్బలు తగిలితే అంత తొందరగా మానవు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు ఏదైనా తినకూడని వస్తువు తింటే వెంటనే రియాక్షన్స్ వస్తాయి అని చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారికి బెండకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది. మరి షుగర్ వ్యాధి ఉన్నవారికి బెండకాయ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం రెండు బెండకాయలను తీసుకొని రెండు వైపులా వాటి కొనలను కోసి, అనంతరం మధ్యలో చిన్నగా కోసి వాటిని నీరు ఉన్న గ్లాసులో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇక మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు ఆ గ్లాసులోనే బెండకాయలను పక్కకు తీసేసి ఆ నీటిని తాగాలి. ఆ విధంగా రెండు వారాలపాటు ప్రతిరోజు ఆ నీటిని తాగితే షుగర్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే షుగర్ కూడా అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలోని చక్కర స్థాయి నియంత్రిస్తుంది.