Site icon HashtagU Telugu

Jaggery in Winter: చలిని తట్టుకోలేకపోతున్నారా ? బెల్లంతో వీటిని కలిపి తినండి..

Jaggery Benefits

Jaggery Benefits

Jaggery in Winter: దేశవ్యాప్తంగా చలి పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది. చలిని తట్టుకోవడం చాలా మందికి కష్టం. రోగనిరోధకశక్తి కూడా చలికాలంలో బలహీనంగా ఉంటుంది. అందుకే వింటర్లో ప్రత్యేకంగా కొన్ని ఆహారాలను తినాలి. శరీరానికి ఉష్ణోగ్రతను అందించే పదార్థాలను తినాలి. వాటిలో ఒకటి బెల్లం. ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తింటే.. చలిని తట్టుకోవచ్చు. శీతాకాలంలో బెల్లం-నువ్వులు కలిపి లడ్డూల్లా చేసుకుని తింటే పోషకాలతో పాటు.. ఉష్ణోగ్రత లభిస్తుంది.

నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం వంటి సాంప్రదాయ వైద్య విధానాల్లో బెల్లం, నువ్వులను శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహార పదార్థాలుగా చెబుతారు. బెల్లం తింటే.. ఇన్ స్టంట్ ఎనర్జీ అందుతుంది.

నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి అధికం. బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అలాగే జీర్ణలక్షణాలు ఎక్కువ. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కూడా జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. నువ్వులు-బెల్లం కలిపి తింటే.. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

బెల్లంలో విటమిన్ సి, నువ్వుల్లో నాన్ హీమ్ ఇనుము శోషణను పెంచుతాయి. ఐరన్ లోపం ఉన్నవారు ప్రతిరోజూ బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలను తింటే మంచిది. అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది.

నువ్వుల్లో ఉండే సెసామిన్, సెసామాల్తో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను నశించకుండా కాపాడుతాయి. బెల్లంలో గ్లైసెమిక్ తక్కువే కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచదు. మధుమేహం ఉన్నవారు ఆర్గానిక్ బెల్లాన్నితినొచ్చు.