ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి పడరాని పాట్లు పడుతూ ఉంటారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం మంచి మంచి ఆహారలతో పాటు కూరగాయలు పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే మధు మొహంతో బాధపడుతున్న వారికి కూరగాయల లో ఒకటైన పచ్చిబఠాన్ని ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు నిత్యం వారు తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అటువంటి వారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంత బాగా ఉపయోగపడతాయి. పచ్చి బఠాణి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేయడంతో పాటు షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా ఆకలి అవ్వదు. దాంతో తిండి మీద కోరిక తగ్గి ఆహారం తక్కువగా తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గుతారు. హైబీపీ రాకుండా చూస్తుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున శరీరానికి పోషణ అందుతుంది. కనుక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల డయాబెటిస్ తగ్గించుకోవచ్చు. పచ్చి బఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఎ,సి,కె లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠాణీల్లోనీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషంట్స్‌కు చాలా ముఖ్యం ఇందులో కార్బోహైడ్రేట్స్, నేచురల్ షుగర్ లెవల్స్ పుష్కలంగా ఉంటుంది.