Ghee: కీళ్ల నొప్పులు తగ్గాలంటే పరగడుపున నెయ్యితో అలా చేయాల్సిందే?

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అనేక రకాల వంటకాల తయారీలో, అలాగే అనేక స్వీట్లు

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 09:10 PM IST

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అనేక రకాల వంటకాల తయారీలో, అలాగే అనేక స్వీట్లు తయారీలో కూడా నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. వేడి వేడి అన్నం ముద్ద పప్పు, ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు అని చెప్పవచ్చు. అలాగే నెయ్యి తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వైద్యులు కూడా మన డైట్ లో నెయ్యిని చేర్చుకోమని చెబుతూ ఉంటారు. నెయ్యి యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర కొవ్వుని తగ్గిస్తుంది.

ఎముకలు, కీళ్లని బలపరుస్తుంది. రక్తాన్నిశుద్ది చేస్తుంది. శరీర కణజాలాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా నెయ్యి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు వైద్యులు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యిని కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గేందుకు కూడా నెయ్యి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. విరేచనాలు వంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వివిధ వ్యాధుల్ని నివారించడంలో చక్కగా పని చేస్తుంది. వర్షాకాలంలో పొట్ట, జీర్ణక్రియకి సమస్యలు ఎక్కువగా తెస్తుంది.

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి నెయ్యి తీసుకుంటే జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. పేగు గోడల్ని శుభ్రం చేస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలని నివారిస్తుంది. ఉదయాన్నే ఒక టీ సూపన నెయ్యి తీసుకుంటే శరీరం నుంచి టాక్సిన్స్, కొవ్వుని బయటకి పంపిస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడే గుణాలు, అమైనో ఆమ్లాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తాయి. శరీరమంతా రక్త ప్రసరణ వేగవంతంగా జరిగేలా చేస్తుంది. గోరువెచ్చని నీరు, ఒక టీ స్పూన్ నెయ్యి కళ్ళకి మేలు చేస్తుంది. కంప్యూటర్లు, ఫోన్లు, టెలివిజన్ అధికంగా చూడటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి దృష్టి సంబంధిత సమస్యలు నయం చేయడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళు వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అటువంటి వాళ్ళు ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్న స్త్రీలు ప్రతి రోజూ ఉదయం అల్పాహారానికి ముందు నెయ్యి తీసుకుంటే ఆ లోపం నుంచి బయట పడవచ్చు.