Site icon HashtagU Telugu

Bael Leaves: వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తీసుకుంటే ఏం జరుగుతుందో.. ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

Bael Leaves

Bael Leaves

మారేడు దళం.. దీనినే బిల్వ పత్రం అని కూడా అని పిలుస్తూ ఉంటారు. ఈ మారేడు ఆకులు పరమేశ్వరుడికి చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. పరమేశ్వరుడికి ఒక్క చెంబు నీళ్లు, బిల్వ పత్ర ఆకులు సమర్పిస్తే చాలు ఆయన ప్రసన్నుడుఅవుతాడని కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలామంచిది అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.

ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు నమలడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట. ఈ ఆకులను కషాయం రూపంలో తీసుకున్న కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తాయట. మారేడు ఆకులో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు, విటమిన్లు ఏ, సి, బి1, బి 6 పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ మారేడు ఆకు మనలో ఇమ్యూనిటీని పెంచుతుందట. మారేడు ఆకులను తింటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చనని చెబుతున్నారు. అలాగే బిల్వ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట.

మారేడు ఆకులను తింటే బీపీ తగ్గుతుందట. గుండె సమస్యలు కూడా రావు అని చెబుతున్నారు. మారేడు ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయట. ఈ ఆకుల్లో లభించే సమ్మేళనాలు షుగర్‌ ను అదుపు చేస్తాయట. మారేడు ఆకులను నమలడం వల్ల కాలేయం ఆరోగ్యంగా మారుతుందని, కాలేయంలోని టాక్సిన్ లను తొలగించడంలో ఇది సహాయపడుతుందని,ఉదయాన్నే మారేడు ఆకులను నమలడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుందని ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయట. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుందట శ్వాసకోస సమస్యలు తగ్గుతాయట. ఆస్తమా కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. అలాగే మారేడు ఆకుల్లో ఉండే ఎంజైమ్స్‌ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయట. ఈ ఆకులను నమలడం వల్ల మలబద్దకం, అజీర్తి నుంచి దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. కాగా మారేడు ఆకులను ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని మలినాలు అన్నీ బయిటకు పోతాయట. రక్తం కూడా శుద్ధి అవుతుందట. బాడీ డీటాక్స్‌ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version