మామూలుగా స్త్రీ పురుషులకు పాదాల పగుళ్ల సమస్యలు రావడం అన్నది సహజం. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ పాదాల పగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పాదాల పగుళ్ల సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వాటి కారణంగా కొన్ని కొన్ని సార్లు రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టదు. దాంతో అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది. మడమల పగుళ్లతో ప్రారంభమై చీము ఏర్పడటం, రక్తస్రావం వంటి సమస్యల వరకు వెళుతుంది. కేవలం చలికాలంలో మాత్రమే కాకుండా కొందరికి ఏడాది పొడవునా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
అయితే అలా బాధపడేవారి శరీరంలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లోపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పాదాల పగుళ్ల సమస్యను ఎలా తగ్గించుకోవాలి? అందుకోసం ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో, చల్లని వాతావరణం ఉన్న సమయంలో వీచే పొడి గాలులు మన ముఖాన్నే కాకుండా శరీరంతో పాటుగా చీల మండలను కూడా దెబ్బతీస్తాయి. అందుకే ముఖాన్ని, శరీరంతో పాటుగా పాదాలను కూడా వెచ్చగా, మృదువుగా ఉంచాలి. మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు చాలా అవసరమవుతాయి. ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవాలంటే ముందుగా పోషకాలను పుష్కలంగా తీసుకోవాలి.
మీరు తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ లు మెండుగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఇక కాళ్ళ మడమల పగుళ్లను తగ్గించుకోవాలంటే మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని మడమలపై అప్లై చేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండటం వల్ల ఆ పాదాల పగుళ్ల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
అలాగే మీ పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి.. తర్వాత టవల్స్ తో తుడిచి, మడమలు పూర్తిగా ఆరిన తర్వాత కలబంద జెల్ ను అప్లై చేసి సాక్స్ లను వేసుకోవాలి. ఉదయాన్నే మీ పాదాలను సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్ల సమస్యలు తగ్గి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పగిలిన మడమలను కొబ్బరి నూనెతో రాత్రిపూట మసాజ్ చేయాలి. సాక్సులను వేసుకుని నిద్రపోవాలి. ఇది కూడా పగుళ్లను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పొద్దున్నే తేడాను కూడా గమనిస్తారు.పాదాల పగుళ్లను వదిలించుకోవడానికి వీటిని ఎప్పుడూ తేమగా ఉంచడం చాలా అవసరం.
note: పైన సమాచారం లో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.