Site icon HashtagU Telugu

Neck Pain: మెడనొప్పి భరించలేకపోతున్నారా.. ఈ టిప్స్ తో ఆ నొప్పి మాయం అవ్వడం ఖాయం!

Neck Pain

Neck Pain

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మెడ నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ మెడ నొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. నరాలు, ఎముకల్లో బలం తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో ఉండటం లేదా టీవీలు, స్మార్ట్ ఫోన్ లు, లాప్టాప్ లు వంటివి ఎక్కువ సేపు చూడటం, ఒకే పొజిషన్ లో ఉండి చూడటం లాంటి వాటి వల్ల కూడా మెడ నొప్పి వస్తుందట. అయితే ఈ మెడ నొప్పి తగ్గించుకోవడానికి రకరకాల స్ప్రేలు, ఆయింట్మెంట్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని చేసిన కూడా కొన్ని సార్లు ఈ మెడ నొప్పి తగ్గదు.

అయితే అలాంటప్పుడు ఏమి చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి వస్తే, వెంటనే ఏ పనీ చేయకూడదట. ముందుగా మీ మెడను మెల్లగా తిప్పాలట. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో రక్త ప్రసరణ పెరిగి, వాపు తగ్గుతుందని చెబుతున్నారు. ముందుగా మీ తలను నిటారుగా పెట్టాలట. ఆ తర్వాత మీ మెడను కుడివైపుకు మెల్లగా తిప్పాలట. కొన్ని సెకన్ల తర్వాత ఎడమవైపుకు తిప్పాలట. చివరిగా మీ తలను పైకి, కిందకు మెల్లగా కదపాలని చెబుతున్నారు. ఈ సులువైన వ్యాయామం చేయడం వల్ల మెడ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. మెడ నొప్పికి మంచి ఉపశమనం కోసం వేడి లేదా చల్లని నీటితో కాపడం పెట్టవచ్చట.

దీనికోసం మార్కెట్లో కాపడం సంచులు దొరుకుతాయట. వాటిని కొనుక్కొని వాడుకోవచని చెబుతున్నారు. లేకపోతే ఒక వస్త్రాన్ని వేడి నీరు లేదా చల్లని నీటిలో ముంచి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. రోజుకు మూడు సార్లు, 10 నిమిషాల పాటు ఇలా చేస్తే మెడ నొప్పి తగ్గడం మొదలవుతుందట. మెడ నొప్పికి మంచి పరిష్కారం కావాలంటే కొద్దిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలట. అంటే వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే మెడ నొప్పి తగ్గడమే కాకుండా, వాపు కూడా తగ్గుతుందట. ఇలా స్నానం చేయడం వల్ల మెడ భాగంలో రక్త ప్రసరణ పెరిగి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే కొబ్బరి నూనె లేదా మీకు నచ్చిన ఏదైనా నూనెను కొద్దిగా వేడి చేసి, మెడలో నొప్పి ఉన్న చోట రాసి మెల్లగా మసాజ్ చేయాలట. ఇలా మసాజ్ చేయడం వల్ల మెడ కండరాలు వదులై, నొప్పి, వాపు తగ్గుతుందని చెబుతున్నారు.