Site icon HashtagU Telugu

Bad Breath: యాపిల్ తో నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టండిలా?

Bad Breath

Bad Breath

చాలామందికి నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని కారణంగా నలుగురితో మాట్లాడాలి అన్నా, నలుగురితో కలిసి తిరగాలి అన్న నోటి దుర్వాసన కారణంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది శుభ్రంగా బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన సమస్య ఇస్తూనే ఉంటుంది. దాంతో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్లు ఇబ్బంది పడతారేమో అని గిల్టిగా ఫీల్ అవుతూ ఉంటారు. నోటి దుర్వాసనకు గల కారణాలు.. తక్కువ నీరు తాగడం, ఎక్కువగా తింటూ ఉండడం, దీర్ఘకాలిక మలబద్ధక సమస్య, ఎక్కువగా నిద్ర పోవడం లాంటివి నోటి దుర్వాసనకు కారణాలుగా చెప్పవచ్చు.

ఈ నోటి దుర్వాసన ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కడుపులో సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల కారణంగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి నోరు శుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమమైన మార్గం. రోజూ బ్రష్ చేయడం, భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించడం, ఎక్కువసేపు ఆకలితో ఉండకపోవడం, తరచూ నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలతో కూడా నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.
నోటిలోని బ్యాక్టీరియా చెడు వాయువును విడుదల చేస్తుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలం విడుదలను నిరోధిస్తుంది.

మీరుహైడ్రేటెడ్‌గా ఉంటే, నోటి దుర్వాసన తగ్గుతుంది. మీ నోరు పొడిగా ఉంటే ఒక గ్లాసు నీరు తాగాలి తులసి ఆకులు, పుదీనా నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. మీరు నోటి దుర్వాసనతో బాధపడుతుంటే.. మీ జేబులో కొన్ని పుదీనా, తులసి ఆకులను పెట్టుకోండి. ఇవి దంతాలను శుభ్రం చేయవుకానీ, తీవ్రమైన నోటి దుర్వాసన నుంచి ఉపశమనం ఇస్తాయి. ఈ టిప్‌ చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. మీరు ఇంటి నుంచిబయటకు వెళ్లేటప్పుడు మీతో పాటు ఒక యాపిల్ తీసుకుని వెళ్లండి. యాపిల్స్‌లో ఆక్సిడైజ్డ్ పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి నోటి దుర్వాసనను దూరం చేయడానికి సహాయపడతాయి. యాపిల్‌ తింటే దంతాలు కూడా శుభ్రపడతాయి. నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేయడానికీ నిమ్మకాయలు సహాయపడతాయి. మీకు నోటి దుర్వాసన చికాకు తెప్పిస్తుంటే నిమ్మకాయ నీళ్లు తాగండి. నిమ్మకాయ దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ తిన్న తర్వాత నిమ్మకాయ రసం తీసుకుంటే నోటి నుంచి చెడ్డ వాసన రాదు.

Exit mobile version