Site icon HashtagU Telugu

బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ జామ ఆకుల రెసిపీ ట్రై చెయ్యండి!

V6yq2y9j

V6yq2y9j

జామ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ జామపండు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే జాంపండు తో పాటు జామ ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తాజాగా అధ్యయనంలో తేలింది. మరి జామ ఆకులు తినడం వల్ల మనకు ఎటువంటి లాభాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామ ఆకులు శరీరంలోని కార్బోహైడ్రేట్లను తగ్గిస్తాయి. సులువుగా మన శరీరం బరువు తగ్గే విధంగా చేస్తుంది.

అలాగే జామ ఆకుల నుంచి తయారైన టీ ఆల్ఫా గ్లూకోసిడోస్ ద్వారా షుగర్ వ్యాధి రోగులలో రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జామ ఆకులను కొద్దిగా బియ్యపు పిండి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. అదే విధంగా జామ ఆకుల రసాన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరిగిస్తుంది.