Site icon HashtagU Telugu

Earphones: వామ్మో.. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే అంత ప్రమాదమా?

Smartwatches Under 3k

Smartwatches Under 3k

ఇయర్ ఫోన్స్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వినియోగిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జర్నీలో ఉన్నప్పుడు ఒంటరిగా పాటలు వినడానికి అలాగే పని చేసుకుంటున్నప్పుడు ఇలా అనేక సందర్భాలను బట్టి వీటిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇయర్ ఫోన్స్ మాత్రమే కాకుండా బ్లూటూత్, వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చాయి. నిత్యం వీటిని వినియోగిస్తూనే ఉన్నారు.

కొంతమంది అయితే వీటిని నాన్ స్టాప్ గా వాడుతూనే ఉంటారు. ఏ పని చేసినా కూడా వీటిని పెట్టుకుని చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. నేటితరం పిల్లలు, పెద్దలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు హెడ్ సెట్ చెవుల్లో పెట్టుకుని కనిపిస్తున్నారు. కొందరు కాల్స్ మాట్లాడటానికి వాడితే మరికొందరు సాంగ్స్ వినడానికి, మూవీ చూడటానికి వినియోగిస్తున్నారు. ఎందుకంటే సౌండ్ బయటకు పెడితే ఇతరలకు ఇబ్బంది కలుగుతుందని అందరూ హెడ్ ఫోన్స్ వాడుతున్నారు.

హెడ్ ఫోన్స్ చెవిలోపల పెట్టి సాంగ్స్ వినడం, కాల్స్ నాన్ స్టాప్‌గా మాట్లాడటం వలన నెమ్మదిగా వినికిడి సమస్య వస్తుంది. సౌండ్స్ అధికంగా వినేవారికి చెవిపోటుతో పాటు ఒక్కోసారి తల కూడా నొప్పి లేస్తుందని అంటున్నారు. ఒకవేళ ఉపయోగించాలి అనుకుంటే 60 డేసిబెల్స్ కంటే వాల్యూమ్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువగా శబ్దం వింటే త్వరగా వినికిడి సమస్య వస్తుంది. హెడ్ ఫోన్ పెట్టుుకుంటే మొబైల్ వాల్యూమ్ 50% ఉండేలా చూసుకోవాలి. సౌండ్ పెరిగితే అలర్ట్ పెట్టుకోవాలి. బడ్స్, ఇయర్ ఫోన్ కంటే హెడ్ సెట్ బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది హెడ్ పై నుంచి కవర్ చేస్తుంది. కర్ణబేరికి దూరంగా ఉంటుంది. వీటిని వినియోగించడం మంచిదే కానీ శృతిమించి అతిగా వినియోగించడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.