Site icon HashtagU Telugu

Earley Dinner: ఏంటి.. రాత్రిపూట తొందరగా భోజనం చేయడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

Earley Dinner

Earley Dinner

కాలం మారిపోవడంతో ప్రజల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ఇదివరకు రెండు రోజుల్లో మన పెద్దలు సాయంత్రం సూర్యాస్తమయం లోపు భోజనం చేసి రాత్రి 8 గంటల లోపు పడుకొని నిద్రపోయేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం అర్ధరాత్రి అయినా కూడా ఇంకా తినకుండా పడుకోకుండా అలాగే ఉంటూ లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే మనకు ఎన్ని రకాల పనులు ఉన్నా ఆ టైం టు టైం భోజనం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ చాలామంది పనులో పడి ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా రాత్రి పూట ఎక్కువమంది తొమ్మిది తర్వాత 10 తర్వాత కొంత మంది అర్థరాత్రి సమయంలో కూడా తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఇకపోతే రాత్రి సమయంలో తొందరగా భోజనం చేసి పడుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి అర్లీగా భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక అధ్యయనం ప్రకారం రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీవిత కాలం పెరుగుతుందట. అలా అని ఏది పడితే అది కాకుండా సరైన పోషకాలు కలిగిన రాత్రి సమయంలో తినాల్సిన ఆహారాన్ని మాత్రమే తినాలని చెబుతున్నారు.

రాత్రి తొందరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుందట. రాత్రి ఏడు గంటలకు తినడం వల్ల నిద్రపోవడానికి చాలా సమయం ఉంటుంది. దీంతో మీరు తిన్నది బాగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన శరీర పనితీరు కూడా మందగిస్తుంది. అందుకే రాత్రిపూట త్వరగా తినడం మంచిది. ఇది మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. డిన్నర్ కు నిద్రపోవడానికి మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల మీకు బాగా నిద్ర పడుతుంది. తిన్నది సులభంగా జీర్ణం కావడం వల్లే ఇలా జరుగుతుంది. అజీర్థి సమస్య తక్కువగా ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే రాత్రి తొందరగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

అలాగే మీ మెటబాలిజం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో నిద్రపోయే ముందు తిన్న ఆహారం చాలా వరకు జీర్ణమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రాత్రిపూట త్వరగా తినడం వల్ల మీ శరీరానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అలాగే మీ శరీరం అన్ని పోషకాలను బాగా గ్రహిస్తుంది. త్వరగా తినడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ ను బాగా ఉపయోగించగలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు. ఈ అలవాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.