Site icon HashtagU Telugu

Diabetes: చిన్నవయసులోనే మధుమేహం.. కండరాలలో తగ్గుతున్న పటుత్వం?

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అలాగే ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఈ డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే ఈ డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ డయాబెటిస్ వ్యాధినీ పూర్తిగా నయం చేసుకునే మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు.

కానీ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి మాత్రం ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గడం అన్నది సాధారణం. కండరాలు బలంగా ఉండాలంటే ఎముకలు కూడా బలంగా ఉండాలి. అప్పుడు ఆహారంలో కాల్షియం పాలు, పెరుగు, ఆకుకూరలు, గింజలు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే తగినంత ప్రొటీన్ల కోసం మాంసం, గుడ్లు, శాకాహారులైతే పప్పులు తరచుగా తినాలి. బియ్యం, మైదాతో చేసిన బ్రెడ్డు లాంటివి మానేసి ముడి ధాన్యాలను తీసుకోవాలి.

అయితే వ్యాయామం కోసం కేవలం నడక మాత్రమే కాకుండా ఏవైనా బరువులు ఉపయోగించి చేసే వ్యాయామాలు కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. శరీరానికి తగినంత ఆహారం తీసుకోకపోతే కూడా బరువుతో పాటు కండరాల పటుత్వం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువును నియంత్రించుకునే విధంగా ఆహారాన్ని, జీవనశైలిని అలవర్చుకోవాలి.

Exit mobile version