Site icon HashtagU Telugu

Ear Infection: వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..అయితే ఇవి పాటించాల్సిందే!

Ear Infection

Ear Infection

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లిపొంగుతున్నాయి. చిన్నచిన్న చెరువులు నదులను తలపిస్తున్నాయి. వర్షాకాలం వరదలను తీసుకురావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను కూడా తీసుకువస్తుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లతో పాటుగా జలుబు,దగ్గు,జ్వరము లాంటి సమస్యలు రావడం సహజం. అయితే వర్షాకాలంలో కావాలని కొంతమందికి వానలో తడుస్తూ నానుతూ ఉంటారు. వర్షాకాలంలో నిర్లక్ష్యం చేయడం వల్ల దెబ్బతినడంతో పాటుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సీజనల్ వ్యాధులు రావడం, మరి ముఖ్యంగా చెవి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.

వర్షాకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్యలలో చెవి ఇన్ఫెక్షన్ సమస్య కూడా ఒకటి. మరి వర్షాకాలంలో చెవి నొప్పిని చెవి ఇన్ఫెక్షన్ నివారించాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షం నీరు కారణంగా చాలామందికి చెవిలో తీవ్రమైన నొప్పి రావడం చెవులు తిమ్మిరి తిమ్మిరిగా ఉండడం లాంటి సమస్యలు వస్తుంటాయి. వర్షాకాలంలో చెవి నొప్పి లక్షణాల విషయానికొస్తే.. చెవిలో నొప్పి అనుభూతి, అలాగే చెవి బయట భాగంలో ఎరుపు, చెవి లోపల దురదగా ఉండటం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.

అలాగే ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు అలాగే ఏదైనా శబ్దం చేసినప్పుడు వినిపించకపోవడం, చెవులు ఎప్పుడూ ఏదో భారంగా ఉన్నట్టుగా అనిపించడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ముఖ్యంగా చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చెవిలోపల నుంచి తెలుపు లేదంటే లైట్ పసుపు రంగులో చీము వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇతర రంగులలో కూడా చీము రావచ్చు. కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.. ఎప్పుడూ చెవులను పొడిగా ఉంచుకోవాలి. అలాగే చెవులను తరచుగా మృదువైన కాటన్ లాంటి దానితో తుడుచుకోవాలి. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ అలా అని ఎక్కువ సేపు పెట్టుకోకూడదు. కానీ ఇతరులు ఉపయోగించే ఇయర్ ఫోన్లను ఉపయోగించడం మానుకోండి.. ఇయర్ బర్డ్స్ ని ఉపయోగించకూడదు. ఇవి చెవిలో ఇన్ఫెక్షన్లు మరింత పెంచుతాయి.