Health Tips: చలికాలంతో దగ్గు జలుబుతో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రైఫ్రూట్స్ వేయించి తినాల్సిందే?

చలికాలం మొదలయింది అంటే చాలు దగ్గు, జలుబు,జ్వరం,ఒళ్ళు నొప్పులు, తల భారం ఇలా ఎన్నో రకాల సమస్యలు వాటికి తోడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ జలుబు

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 09:30 PM IST

చలికాలం మొదలయింది అంటే చాలు దగ్గు, జలుబు,జ్వరం,ఒళ్ళు నొప్పులు, తల భారం ఇలా ఎన్నో రకాల సమస్యలు వాటికి తోడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ జలుబు దగ్గు కారణంగా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యి సరిగా నిద్ర రాక ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. అయితే చలికాలంలో వచ్చే ఈ దగ్గు జలుబులో కొన్ని డ్రైఫ్రూట్స్ తో నివారించవచ్చట. ఇంతకీ ఆ డ్రై ఫ్రూట్స్ ఏవి వాటిని ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారికి ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినమని సలహా ఇస్తూ ఉంటారు.

అయితే ఖర్జూరాన్ని నానబెట్టుకుని, లేదంటే వేయించి తింటే శరీరానికి వెచ్చదనంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా చలికాలంలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. నానబెట్టిన ఖర్జూరం, లేద వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో విటమిన్ బి-6 పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, విటమిన్ బి1, బి2, రిబోఫ్లావిన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఈ విటమిన్లన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విటమిన్ శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో ఇంటర్‌లు కిన్ లభిస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌లను తగ్గిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను చాలా వేగవంతం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఖర్చూరం గొప్పగా హెల్ప్‌ చేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో ఖర్జూరాన్ని కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, శరీరం నుండి కఫం తొలగించడానికి కూడా ఇది పనిచేస్తుంది. శ్వాస సమస్యను క్లియర్‌ చేస్తుంది. ఊపిరితిత్తులలో నిండుకున్న కఫాన్ని బయటకు పంపడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఖర్జూరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జ్వరం, తలనొప్పిని నివారిస్తాయి. ఖర్జూరాన్ని నానబెట్టి తింటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇది శరీరాన్ని చాలా వెచ్చగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి కఫాన్ని బయటకు పంపడానికి కూడా పనిచేస్తుంది. బట్టి ఖర్జూరాన్ని పాలలో 24 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు అందులో కాస్త కుంకుమ పువ్వు, యాలకులు, అల్లం కలిపి తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.