Dry Fish : ఎండు చేపలు తింటే ఎన్ని “ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

Dry Fish : ఎండు చేప(Dry Fish )లలో ఉన్న క్యాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను, ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి

Published By: HashtagU Telugu Desk
Dry Fish

Dry Fish

ఎండు చేపలను (Dry Fish ) చూసి చాలా మంది ముఖం చాటేస్తుంటారు. వాసన ఎక్కువగా ఉంటుందనే కారణంతో తినడానికి అసహ్యంగా భావిస్తారు. అయితే పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలలో మరింత ఎక్కువగా పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, విటమిన్ B12, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో ముఖ్యమైన పోషక పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఒకే దాంట్లో దొరకాలంటే, ఎండు చేపలు చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఎండు చేప(Dry Fish )లలో ఉన్న క్యాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను, ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. విటమిన్ B12 మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఎర్ర రక్తకణాల పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. మహిళలకు వచ్చే మూత్ర సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలోనూ ఎండు చేపలు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాకపోతే కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు, హై బీపీ, గుండె జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఎండు చేపలను తినే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే వీటిలో ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీరు తప్ప మిగతా వారు వాసనతో బాధపడకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకునే వారు ఎండు చేపలను సరైన విధంగా వండుకుని తింటే అనేక లాభాలు పొందవచ్చు.

  Last Updated: 08 Jun 2025, 08:27 PM IST