‎Cough: పొడిదగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

‎Cough: తీవ్రమైన పొడి దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cough

Cough

‎Cough: చలికాలం మొదలైంది అంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్ద వరి వరకు చాలామంది జలుబు, జ్వరం దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దగ్గు జలుబు తగ్గడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు అయితే ఇంటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొన్నిసార్లు పోటీ దగ్గు సమస్య మాత్రం అంత తొందరగా వదిలిపెట్టదు. మరి ఇలా పొడి దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొడి దగ్గును తగ్గించడంలో జామ ఆకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

‎జామలో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు ప్రభావాన్ని తగ్గిస్తాయట. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ శ్వాసకోసంలో వాపును, ఇన్ఫెక్షన్ ని నియంత్రిస్తాయట. మైకోలిటిక్ లక్షాలు శవ్వాస నాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతాయని, అందువల్ల జామ ఆకులు దగ్గు తీవ్రతను తగ్గించడమే కాకుండా శ్వాస నాళాలను శుభ్రపరుస్తాయని,పొడి దగ్గుతో బాధ పడుతున్న వారికి ఈ జామ ఆకులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇందుకోసం జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమిలితే దగ్గు నుంచి మీకు ఉపశమనం లభిస్తుందట.

‎లేదంటే మీరు జామ ఆకుల టీ చేసుకొని తాగినా పర్లేదని, దీనివల్ల మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. దీని కోసం మీరు 10 జామ ఆకులను తీసుకొని నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి కనీసం 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తాగితే సరిపోతుంది. రుచి కోసం మీరు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చని, ఈ టీ రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగితే పొడి దగ్గు బాగా తగ్గుతుందట. పెద్దలతో పాటు పిల్లలు కూడా తాగవచ్చని, అయితే 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ఒకసారి మాత్రమే ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జామ ఆకుల టీ తాగడం వల్ల దగ్గు తగ్గడం మాత్రమే కాకుండా గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుందట. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందని, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుందని అందుకే జలుబు ప్రారంభమైన తర్వాత కాకుండా, చలికాలంలో ముందుగానే తీసుకుంటే రక్షణగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ జామ ఆకుల టీ ని గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు, అలర్జీ సమస్య ఉన్నవారు తాగకపోవడమే మంచిదట.

  Last Updated: 03 Dec 2025, 06:37 AM IST