మునగ కాయల వల్ల మాత్రమే కాకుండా ఆకు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు మునగా కాయలతో పాటు మునగా ఆకును కూడా తరచుగా తీసుకోమని చెబుతూ ఉంటారు. సిటీలలో ఉండే వారికి ఈ మునగ ఆకు అంతగా లభించకపోయినా పల్లెటూర్లలో ఉండే వారికి ఎక్కువ మొత్తంలో లభిస్తూ ఉంటుంది. మునగ ఆకులో శరీరానికి రావలసిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
దీంతో పాటు ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, బి కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి. ఇవి తీవ్ర శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అలాగే ఇందులో జింక్‌తో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మునగాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియంతో పాటు జింక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు.
అలాగే మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటి నుంచి విముక్తి కలుగుతుందట. దీంతో పాటు సులభంగా రోగనిరోధక శక్తిని కూడా సులభంగా పెంచుతాయని చెబుతున్నారు. అలాగే మునగాకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనంగా ఉంటుంది.
దీంతో పాటు ఆకులోని ఉండే గుణాలు యాక్టివ్ కాంపౌండ్లు రక్తంలో చక్కెరను గ్రహించడాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు అని చెబుతున్నారు. మునగాకు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే కొన్ని మూలకాలు తీవ్ర మలబద్ధం ఇతర సమస్యలను నివారించేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ మలంలోని ద్రవ్యాన్ని పెంచేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.