Site icon HashtagU Telugu

Belly Fat: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే చాలు ఎలాంటి బెల్లీ ఫ్యాట్ అయినా ఇట్టే కరిగి పోవాల్సిందే!

Belly Fat

Belly Fat

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా ఒకటి. ఈ బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాకింగ్లు చేయడం ఎక్సర్సైజులు చేయడం డైట్ ఫాలో అవ్వడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే ఈ బెల్లీ ఫైర్ కరిగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోవాలి అంటే ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్ తాగాలట. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్ ను కరిగింంచడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయట. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బేబీ సీడ్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉండే చియా సీడ్ వాటర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా కడుపును తొందరగా నింపడానికి సహాయపడుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ గింజలు పొట్టను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను నీటిలో కలపి అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుందట. మరో రెమెడీ విషయానికి వస్తే.. ఉదయాన్నే పరగడుపున మెంతి వాటిని తాగడం వల్ల కొవ్వు ఈజీగా కరిగిపోయి బరువు కూడా తగ్గుతారట. మెంతి వాటర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయట. మెంతులను వేడినీటిలో నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని తాగండి. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఉదయం పరగడుపున నిమ్మరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుందని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ టీ ని కూడా తాగడం వల్ల ఇది కడుపును నిండుగా ఉంచి తక్కువ ఆకలి అయ్యేలా చేస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు బెల్లీ ఫ్యాట్ ని కూడా తగ్గించుకోవచ్చు.