Drinking water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 08:18 AM IST

కాలం ఏదైనా సరే…దాహం తీర్చుకోవడానికి నీరు తాగాల్సిందే. శరీరానికి కావాల్సినంత నీరు అందించకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేసి ఎన్నోరకాల వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంది. మలినాలను శుభ్రపరిచి…రోజంతా తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ 8 గ్లాసుల మంచినీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

నిలబడి నీళ్లు తాగడం చెడు అలవాటు. నిలబడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం..నీలబడి నీళ్లు తాగడం వల్ల నేరుగా లోపలికి వెళ్తాయి. అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. దీంతో రోగాలబారిన పడాల్సి వస్తుంది. దీని దుష్ప్రభావాలు చాలావరకు కాలేయం, మూత్రపిండాలు, కీళ్లపై ఉంటాయి. అందుకే దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందే తెలుసుకుని జాగ్రత్తపడటం చాలా మంచిది.

ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం, నిలబడి నీరు త్రాగడం వల్ల మన శరీరంలో తగినంత పోషకాలు అందవు. నీరు శరీరం నుంచి తొందరగా బయటకు వెళ్తాయి. ఇది మన ఊపిరితిత్తులు, గుండెను కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల ఆహారం, గాలి పైపుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది.

జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది:
నిలబడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే నిలబడి నీరు తాగితే నేరుగా ఫుడ్ పైప్ ద్వారా పొట్ట కిందికి చేరుతుంది. ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కడుపులో ద్రవ సమతుల్యతను దెబ్బతీయడంతోపాటుగా విషపూరితం, అజీర్ణతను పెంచుతుంది.

కిడ్నీలకు హానికరం:
నిలబడి నీటిని తాగినప్పుడు, అది ఫిల్టర్ చేయకుండా పొత్తికడుపులోకి వేగంగా కదులుతుంది. ఇది నీటిలో పేరుకుపోయిన మలినాలను మోసుకెళ్లి, మూత్రపిండాలకు చాలా హాని కలిగించే గాల్ బ్లాడర్‌లో నిల్వ చేస్తుంది. ఇది మూత్రనాళ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది:
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లలో పేరుకుపోతుంది. ఇది ఎముకలు, కీళ్లకు ప్రమాదం కలిగిస్తుంది. బలహీనమైన ఎముకల కారణంగా, ఒక వ్యక్తి ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు గురవుతాడు.

రక్తపోటును పెంచుతుంది:
నిలబడి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మనం నిలబడి నీటిని తాగితే, అది మన నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇలా నీరు తాగడం వల్ల పోషకాలు పూర్తిగా పనికిరాకుండా పోయి శరీరం ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి నిలబడి నీరు తాగకుండా…కూర్చుండి నీరు తాగాలన్న విషయం గుర్తుంచుకోండి.