Site icon HashtagU Telugu

Copper Bottle: కాపర్ బాటిల్ లో నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 11 Jul 2024 12 50 Pm 358

Mixcollage 11 Jul 2024 12 50 Pm 358

చాలామంది రాగి పాత్రలో నీరు తాగుతూ ఉంటారు. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీళ్లు పోసి పెట్టి తర్వాత మొదటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ ఉంటారు. రాగి పాత్రలోని నీరు చేయడానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ విధంగా రాగి పాత్రలో నీరు తాగుతున్నారు. రాగి పాత్రలో నీరు తాగడం మంచిదే కానీ రాగి పాత్రల్లో ఎనిమిది గంటలకంటే మించి ఎక్కువసేపు నీటిని అస్సలు ఉంచరాదు. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల మన శరీరం లోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గుతాయట. అలాగే బీపీ , హార్ట్‌బీట్ అదుపులో ఉంటాయట.

తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా దూరమరవుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వ్యాధికి కారణమయ్యే ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాగి బాటిల్‌లో నీటిని తాగమని చెబుతున్నారు. కాపర్ వాటర్ బాటిల్‌లో నీటిని తాగడం వల్ల శరీరానికి రాగి పోషకాలు లభిస్తాయని అంటున్నారు. సరైన మోతాదులో కాపర్ శరీరానికి అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. తద్వారా హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం బారిన పడే అవకాశముంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో శరీరంలో కాపర్‌లేమిని పూరించాలంటే రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగటం వల్ల ఒంటి నొప్పులను కూడా నయం చేస్తుందట.

ఒక రోజు రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లో నిల్వచేసిన నీటితో శరీరంలోని కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. తద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు అధిక బరువు వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. కాపర్‌ బాటిల్‌ లో నీటిని తాగడం వల్ల క్యాన్సర్‌ సమస్యను దూరం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగిలోని బలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ చేసిన నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పొట్టలో ఏర్పడిన అల్సర్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.