వేసవి కాలంలో శరీరానికి తగినంత ద్రవపదార్థాలు అందించడానికి కొబ్బరినీళ్లు (Coconut Water) ఎంతో మంచివి. తక్కువ కేలరీలతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందించే గుణం కొబ్బరినీళ్లకు ఉంది. డీహైడ్రేషన్ సమస్యను తగ్గించి, శరీరాన్ని ఉష్ణతాపం నుంచి రక్షించగల సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది. అయితే వీటిని అధికంగా సేవించడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం
వైద్యుల తెలిపిన దాని ప్రకారం.. కొబ్బరినీళ్లు అధికంగా తాగితే శరీరంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశముంది. దీనిని “హైపర్‌కలేమియా” అంటారు. ఇది గుండె స్పందన రేటును అసాధారణంగా మార్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమందిలో ఈ ప్రభావం తీవ్రమై, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లు అధికంగా తాగకూడదు. కొబ్బరినీళ్లను తగిన పరిమితిలో తీసుకోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 1-2 గ్లాసుల వరకు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశముందని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వయసు పైబడిన వారు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు కొబ్బరినీళ్ల వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
RRB JE Results: రైల్వే ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
అందువల్ల వేడి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరినీళ్లు మంచివే అయినా, పరిమితిలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే దాని వల్ల మేలు కన్నా, ముప్పే ఎక్కువ కావచ్చు. శరీరంలో పొటాషియం స్థాయిలను సమతుల్యం చేసుకుంటూ, వైద్యుల సూచనలను అనుసరించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.