Coffee: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల అనారోగ్య ప్రమాదాలను తగ్గించవచ్చు..

కాఫీ తాగడం వల్ల స్లిమ్ గా ఉండొచ్చని మీకు తెలుసా? డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడి చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Black Coffee Side Effects

Drinking Three Cups Of Coffee A Day Can Reduce Health Risks.

కాఫీ (Coffee), టీలు ఎక్కువగా తాగడం వల్ల చాలా నష్టాలున్నాయని ఇప్పటివరకు ప్రాచూర్యంలో ఉన్న మాట. కాఫీ, టీలు చెడు అలవాట్లుగా కూడా పరిగణిస్తారు. ‘‘కనీసం కాఫీ అలవాటు కూడా లేదు’’ అని ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడానికి గుర్తుగా చెబుతుంటారు. అయితే ఈ వాదలన్నింటికి తెర దించే రోజు త్వరలో రాబోతోందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు కాఫీ ఎలా, ఎంత మోతాదులో తాగాలో తెలుసుకుందాం.

  1. రోజుకు మూడు కప్పుల కాఫీ వల్ల అనారోగ్య ప్రమాదాలను తగ్గించవచ్చని స్వీడన్ నిపుణులు తెలుపుతున్నారు.
  2. రక్తంలో ఎక్కువ స్థాయిలో కెఫిన్ ఉన్నపుడు స్థూల కాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాలు తగ్గుతాయట.

క్యాలరీలు లేని కెఫిన్ కలిగిన పానీయాలు బరువు తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తాయట. కానీ ఈ విషయం గురించి మరింత విపులంగా పరిశోధన సాగాలని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సుసన్నా లార్సన్ అభిప్రాయపడ్డారు. వారి పరిశోధనల్లో కెఫిన్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలిందని లారెన్స్ వివరించారు.

ఇండిపెండెంట్ గా కొంత మంది నిపుణుల చేసిన అధ్యయనాల్లో ఈ ఫలితాలకు బలాన్నిచ్చే ఆధారాలు లభించాయట. కెఫిన్ శరీరంలో జీవక్రియలను 3 నుంచి 11 శాతం వరకు పెంచుతుందని ఈ అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, స్థూల కాయ సమస్యలు చాలా పెద్ద హెల్త్ బర్డెన్ గా పరిణమించాయి. స్థూలకాయం డయాబెటిస్ కి మూల కారణం కావచ్చు కూడా.

కాఫీ (Coffee) శరీరంలో కొవ్వును గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా శరీర బరువు తగ్గడం వల్ల డయాబెటిస్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల నిజంగానే స్లిమ్ గా ఉండగలరా అనే విషయాన్ని భవిష్యత్తులో జరిగే పరిశోధనలు కచ్చితంగా నిర్ధారిస్తాయని ఈ అధ్యయనంలో పనిచేసిన ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని క్లినికల్ సైంటిస్ట్ డాక్టర్ డిపెండర్ గిల్ వివరించారు.

బరువు తగ్గొచ్చనే ఆశతో కాపీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫిన్ తో వచ్చే దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదం ఎప్పటికి పొంచి ఉంటుందని కూడా డాక్టర్ గిల్ అంటున్నారు. ‘‘కాఫీ వినియోగం పెరిగితే కొంత మందిలో నిద్ర సమస్యలు రావచ్చు. కొంత మందిలో పాల్పిటేషన్లు కలిగించవచ్చు, ఈ అధ్యయనాన్ని అనుసరించి కాఫీ వినియోగం పెంచడం అంత మంచిది కాదు’’ అని డాక్టర్ గిల్ సలహా ఇస్తున్నారు. ఇక ముందు ఈ విషయం మీద జరిగే పరిశోధనలకు వారి అధ్యయనం మార్గదర్శనంగా ఉంటాయని అంటారు.

ఈ పరిశోధనలో పాల్గొనని వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ స్టీఫెన్ లారెన్స్ కొవ్వు కరిగించుకునేందుకు, డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించేందుకు ఎక్కువగా కాఫీ తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కెఫిన్ వల్ల విశ్రాంతిగా ఉన్నపుడు కూడా శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ జరుగుతుంది. సైన్స్ పాక్షికంగా సాక్ష్యాలను చూపినప్పటికీ ఇది స్థూలకాయానికి చికిత్సగా పరిగణించలేం. ఎందుకంటే దీన్ని తీసుకోకూడని విధంగా తీసుకుంటే తప్పకుండా బరువు పెరుగడం మాత్రమే కాదు.. ఇతరత్రా ఆరోగ్యానికి హాని జరగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు.

Also Read:  Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?

  Last Updated: 18 Mar 2023, 01:55 PM IST