Site icon HashtagU Telugu

Health Benefits : చాయ్ తాగండి…చావు ప్రమాదం తగ్గించుకోండి: కొత్త అధ్యయనం

Zinger Tea

Zinger Tea

ఉదయం లేవగానే చాయ్ కావాలి. సాయంత్రం నాలుగు అయ్యిందంటే చాలు చాయ్ కావాలి. రోజులో మధ్య మధ్యలో చాయ్ కావాలి. చిక్కటి పాలలో టీపొడి వేసుకుని మరిగించిన టీ తాగుతే ఆ మజానే వేరుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చాయ్ ఎక్కువగా తాగితే బోల్డన్నీ సమస్యలున్నాయని ఇప్పటివరకు విన్నాం. కానీ ఇప్పుడు కొత్త అధ్యయనాల్లో తేలిందేంటంటే…చాయ్ తాగుతే చావు నుంచి తప్పించుకోవచ్చని. అవును నిజం. అసలు విషయం తెలుసుకుందాం.

ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో చాయ్ కు మించినది మరొకటి లేదు. ఇలాంటి హాట్ డ్రింగ్ గురించి కొత్త అధ్యయనం కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చాయ్ ఎక్కువగా తాగితే డెత్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. చాయ్ తాగనివారితో పోల్చితే…రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగేవారిలో మరణ ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.

లండన్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ హెల్త్ కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు బ్లాక్ టీ తాగితే కలిగే సంభావ్య మరణాల ప్రయోజనాల గురించి తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. ప్రతిరోజే రెండు కప్పులకు పైగా చాయ్ తాగే వ్యక్తుల్లో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం…చాయ్ తాగనవారి కంటే 9శాతం నుంచి 13శాతం వరకు తక్కువగా ఉందని NIHఒక ప్రకటనలో తెలిపింది. 40 నుంచి 69ఏళ్ల వయస్సు గల 4,98,043 మంది పురుషులు, స్త్రీలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 89శాతం మంది బ్లాక్ టీని తాగినట్లు చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా 2006 నుంచి 2010 మధ్యకాలంలో ఒక ప్రశ్నపత్రానికి సమాధానాలు తెలుసుకున్నారు. సుమారు 11 సంవత్సరాల పాటు ఈ పద్దతిని అనుసరించారు. లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి లింక్ చేసిన డేటా బేస్ నుంచి ఈ మరణ సమాచారం వచ్చింది.

కెఫిన్ జీవక్రియల జన్యువైవిధ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా రోజుకు రెండు కప్పులకు పైగా చాయ్ తాగితే తక్కువ మరణప్రమాదంతో ముడిపడి ఉంటుంది. మొత్తానికి ఈ పరిశోధనలు చాయ్ ఎక్కువగా తాగితే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని సూచిస్తున్నారు. అయితే బ్లాక్ టీ తాగే అలవాటు లేకుంటే పాలు లేదా చక్కర కలుపుని తాగిన ఆరోగ్య ప్రయోజనాల్లో ఎలాంటి గణనీయమైన తగ్గింపు కనిపించలేదు. కానీ చక్కెర, పాలలోని కొవ్వులను పరిమితం చేయడాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.