Tea Glass: పొద్దున్నే టీ వంట్లోకి పోనిది చాలామమంది బెడ్ పైనుంచి పైకి లేవరు. పొద్దున్నే లేవడంతోనే చాలామందికి టీ ఉండాల్సిందే. టీ తాగకుండా ఏ పని చేయరు. అంతలా చాలామంది టీకి ఎడిక్ట్ అయి ఉంటారు. ఇక టిఫిన్ చేయగానే మళ్లీ టీ, సాయంత్రం మరో కప్పు టీ ఎక్కువమంది తాగుతూ ఉంటారు. ఇక రోజుకు ఐదు, ఆరు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ సార్లు టీ తాగే చాలామందిని మనం చూస్తూ ఉంటాం.
ఇంట్లో అయితే గాజు లేదా స్టీల్ గ్లాసులో టీ తాగుతాం. అదే బయట తాగేటప్పుడు ప్లాస్టిక్ లేదా పేపర్ కప్పులో టీ ఇస్తూ ఉంటారు. అయితే అలా పేపర్ లేదా ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ కప్పులో వేడిగా ఉండే టీ తాగడం వల్ల ప్లాస్టిక్ వేడికి కరిగిపోయి కెమికల్స్ టీలో కలుస్తాయి. ఈ కెమికల్ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈ కెమికల్స్ వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుందని, ప్లాస్టిక్‌లో ఉండే కెమికల్స్ కిడ్నీపై నేరుగా ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇక క్రోమియం, కాడ్మియం లాంటి కెమికల్స్ శరీరంలోకి వెళ్లడం మంచిది కాదట. ఇక ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందట. ఇక గర్భిణులు అయితే ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం అసలు శ్రేయస్కరం కాదని అంటున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే మోట్రో సోమిన్, బిస్సినాల్ కెమికల్స్ పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.
అలాగే పురుషులు ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల ప్లాస్టిక్‌లో ఉండే హానికరమైన రసాయనాల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్లాస్టిక్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ లేదా పేపర్ కప్పులో టీ తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం అసలు మంచిది కాదు.