Drinking Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

సోడాలు ఎక్కువ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 08:00 PM IST

Drinking Soda : వేసవిలో మనకు ఎక్కువగా దాహం వేస్తుంది. అందుకని మనం సోడాలు, జ్యూస్ లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తినడం, తాగడం చేస్తూ ఉంటాము. కానీ ఇలా చేయడం వలన మనకు ఆ సమయానికి దాహం తీరినా తరువాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సోడాలు ఎక్కువ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలే ఇటీవల సోడాలో రకరకాల ఫ్లేవర్స్ తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు.

* సోడాలను ఎక్కువగా తాగడం వలన మన పళ్ళు పుచ్చిపోవడం, దంతాలు రంగు మారడం, దంతాలు సున్నితంగా మారడం వంటివి జరుగుతాయి.
* సోడాలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తాగడం వలన మనం అధిక బరువుకు గురవుతారు.
* సోడాలు తాగడం వలన బిపి, డయాబెటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
* సోడా ఎక్కువగా తాగడం వలన మూత్రపిండాలపైన ఒత్తిడి పడి కిడ్నీ సమస్యలు వస్తాయి.
* సోడాలు ఎక్కువగా తాగడం వలన ఎముకలు బలహీనంగా తయారయ్యి ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంది.
* సోడాలు ఎక్కువగా తాగితే తలనొప్పి కూడా వస్తుంది.
* సోడాలు ఎక్కువగా తాగడం వలన అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటివి వస్తాయి.
* సోడాలు ఎక్కువగా తాగడం వలన పురుషులలో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి లిమిట్ లో ఎప్పుడో ఒకసారి అంటే సోడా పర్లేదు కానీ రోజూ అదేపనిగా సోడా తాగితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.

Also Read : Eye Cancer: దేశంలో క్యాన్స‌ర్‌ ముప్పు.. కొత్త‌గా కంటి క్యాన్స‌ర్, ల‌క్ష‌ణాలివే..!