Site icon HashtagU Telugu

Sabja Water: పరగడుపున సబ్జా నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 11 Jul 2024 09 59 Am 7344

Mixcollage 11 Jul 2024 09 59 Am 7344

సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇతర సీజన్లతో పోల్చుకుంటే వేసవికాలంలో ఈ సబ్జా గింజలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బయట అనేక రకాల జ్యూస్లలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ అయినా వీటిని తినవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే పరకడుపున సబ్జా నీళ్లు తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనలో చాలామందికి ఉదయం లేవగానే మీరు తాగే అలవాటు ఉంటుంది. మరికొందరు లెమన్ వాటర్ మరి కొందరు హనీ వాటర్ తాగుతుంటారు. అయితే మామూలు నీరు తాగేవారు అందులో కొన్ని సబ్జా గింజలను వేసుకుని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. రోజూ పరగడుపున సబ్జా నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. సబ్జా గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. రోజు ఉదయాన్నే సబ్జా నీరు తాగడం వల్ల జీవితం మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుందట.

అలాగే కడుపులో ఉండే యాసిడ్, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయట. కాగా సబ్జా గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు వైద్యులు. సబ్జా గింజల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో సబ్జా గింజలు తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. మధుమేహం ఉన్నవారు కూడా సబ్జా నీరు తాగడం వల్ల చక్కెర స్థాయిలో స్థిరంగా ఉంటాయట. సబ్జా గింజలో ఉండే యాంటీ అలెర్జిక్ లక్షణాలు ఇవి మొటిమలు, అలెర్జీల వంటి సమస్యల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజల నీటిని తాగితే చర్మం మెరుస్తుంది. సబ్జా గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.