Raw Milk: పచ్చిపాలను తాగితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా?

పాలను తాగడం వల్ల అనేక రకాల పోషకాలతో పాటు ఎముకలకు కావలసిన క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలు

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 08:30 AM IST

పాలను తాగడం వల్ల అనేక రకాల పోషకాలతో పాటు ఎముకలకు కావలసిన క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలు అన్ని రకాల పోషకాలను కలిగి ఉండటం వల్ల వీటిని సంపూర్ణ ఆహారంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. కేవలం పాలు మాత్రమే కాకుండా పాల ఉత్పత్తులు అయినా వెన్న పెరుగు మజ్జిగ లాంటి ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల ఆ వైద్యులు కూడా పాలను తాగాలి అని సూచిస్తూ ఉంటారు. అయితే కొందరు పాలు తాగడానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం ఆ పాలలో కాఫీ పొడి హార్లిక్స్ బూస్ట్ లాంటివి కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం పచ్చిపాలనే తాగుతూ ఉంటారు.

అయితే కొంతమందికి ఈ పాల విషయంలో కొన్ని రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. పచ్చి పాలను తాగాలా లేదంటే మరిగించిన పాలన తాగాలా అని చాలామంది దేహ పడుతూ ఉంటారు. మరి ఏ పాలను తాగితే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చిపాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. పచ్చిపాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.ముడి పాలు లేదా పచ్చి పాలలో లిస్టెరియా,సాల్మెనెల్లా వంటి హానికరమై బ్యాక్టీరియాలు ఉంటాయి. అంతేకాకుండా పచ్చిపాలు తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పచ్చిపాల లో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి హాని చేస్తుంది.

అలాగే పచ్చిపాలన త్రాగడం వల్ల ఆర్థరైటిస్, డయేరియా, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆవు లేదా గేదె నుండి పితికిన పాలను నేరుగా తీసినప్పుడు పొదుగుకు ఉండే కలుషిత పదార్థాలు, క్రిములు ఆ పాలలలో కలుస్తాయి. ఇక వీటిని మరగబెట్టకుండా నేరుగా తాగితే ఎన్నో సమస్యలు రావడంతో పాటు శరీరానికి కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి పచ్చి పాలను ఎప్పుడూ తాగకూడదు.